మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నమ్రత 1993లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా ఎంపికైంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ మూవీస్ లో నటించింది. మహేష్ బాబు హీరోలు ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 1972 జనవరి 22న ముంబైలో జన్మించింది నమ్రత. ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఈమె నానమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి. 1938లో ’బ్రహ్మచారి’ సినిమాలో నటించారు. 1977లో శతృఘ్న సిన్హా ‘షిరిడి కే సాయి బాబా’ సినిమాలో బాలనటిగా నటిచింది నమ్రత. ఆ తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కిన ‘పూరబ్ కీ లైలా.. పశ్చిమ్ కీ చేలా’లో మెరిసింది. ఆ తర్వాత సల్మాన్, ట్వింకిల్ ఖన్నాల ‘జబ్ ప్యార్ కిసిసే హోతా హై’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది.
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాతో మొదటిసారి కలుసుకున్న మహేష్- నమ్రత.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఐదు సంవత్సరాల పాటు డేటింగ్ చేసి 2005 లో పెళ్లిచేసుకున్నారు. మొదటిసారి మహేష్‌ని చూసినప్పుడే ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని, ఓ ఇన్నోసెంట్ అనిపించిందని, అయన ఇచ్చిన మర్యాదకు ఫిదా అయ్యానని నమ్రత చెబుతుంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన నమ్రత.. మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లో కీలక భాగస్వామిగా ఉంటోంది.
Also Read: వంటలక్క కాఫీని గుర్తుపట్టిన సౌందర్య, ఆనందరావు, రుద్రాణికి టైమ్ దగ్గరపడిందా .. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
నమ్రత వచ్చాకే మహేశ్ బాబు కెరీర్ ఊపందుకుంటారు అభిమానులు. పెళ్లిచేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన నమ్రత.. మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది. రెగ్యులర్ గా వెకేషన్స్ కి వెళుతూ భర్త , పిల్లలతో కలసి ఎంజాయ్ చేస్తుంటుంది. పెళ్లి తర్వాత మహేశ్, నమ్రతా రీసెంట్ గా హలో మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరికి గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు సంతానం. మహేష్ బాబు, నమ్రత లాగే గౌతమ్ కృష్ణ కూడా బాల నటుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వన్ నేనొక్కిడినే’ సినిమాలో నటించాడు. మరోవైపు సితార యూట్యూబ్ చానెల్ నడుపుతోంది.
నమ్రతకు సోమవారం అంటే నచ్చదట. మామూలుగానే అందరికీ వీకెండ్ అంటే చాలాఇష్టం. అలా వీకెండ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్లీ సోమవారం బిజీగా మారిపోవడం అస్సలు నచ్చదట. వాస్తవానికి స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి సెలబ్రెటీల వరకూ అందరికీ ఇదే ఫీలింగ్. అందులో నమ్రత కూడా ఉందంటాడు మహేశ్ బాబు. నమ్రత 'వంశీ' సినిమా తర్వాత చిరంజీవితో కలసి ''అంజి'' లోనూ నటించింది.
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి