'Guntur Kaaram' box office collection: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం‘ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. 7 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జనవరి 16, 17న మూవీ కలెక్షన్‌లో కొంచెం తగ్గుదల కనిపించినప్పటికీ, మళ్లీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
రూ.200 కోట్ల గ్రాస్ వసూళు చేసిన 'గుంటూరు కారం'
సంక్రాంతి పండుగ సందర్భంగా ‘గుంటూరు కారం‘ విడుదల అయ్యింది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హనుమాన్‘ బ్లాక్ బస్టర్ అయినా, ‘గుంటూరు కారం‘ మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ, వసూళ్లపరంగా సత్తా చాటుతోంది. తొలి వారంలోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 212 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంతేకాదు, మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టింది. జనవరి 16, 17న కాస్త ఆక్యుపెన్సీ తగ్గినా మళ్లీ పుంజుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒక రీజినల్ ఫిల్మ్ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లోకల్ పొలిటిషీయన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గుంటూరు కారం‘ సంక్రాతికి బరిలో పెద్ద సినిమాగా విడుదలైనా, అనుకున్న స్థాయిలో ఆడియెన్స్ ను అలరించలేకపోయింది.
'గుంటూరు కారం' గురించి..
మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. 2022లో విడుదలైన 'సర్కారు వారి పాట' తర్వాత ఆయన నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాతో పోటీగా బరిలో నిలిచిన ‘హనుమాన్’ మూవీ, ‘గుంటూరు కారం’ సినిమాను మించి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఏకంగా మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లోనూ ఈ మూవీ షోలు క్యాన్సిల్ కావడంతో చిత్రబృందం షాక్ అయ్యింది.
Read Also: తేజా, నేను ఎనిమిదేళ్ల నుంచి చాలా సినిమాలు చర్చించాం, కొన్ని చివరి నిమిషంలో ఆగిపోయాయి: ప్రశాంత్ వర్మ