'గులాబి' సినిమాలో జేడీ చక్రవర్తికి జంటగా నటించిన హీరోయిన్ మహేశ్వరి గుర్తు ఉన్నారా? ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత బుల్లితెర మీదకు వచ్చారు. 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్‌కు మహేశ్వరిని అతిథిగా తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో 'సుడిగాలి' సుధీర్ మీద పంచ్ డైలాగ్స్ వేశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
మహేశ్వరి రాగానే ఆమెకు 'సుడిగాలి' సుధీర్ హాయ్ చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇవ్వబోతే... ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. 'ఇదేంటి? నమస్కారం పెడుతున్నారు?' అని సుధీర్ అడిగాడు. 'వద్దు బాబు! నేను చేతులు కలిపితే... నువ్ ఏ పులిహోరో కలుపుతావ్' అని మహేశ్వరి పంచ్ వేశారు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత 'మేడమ్! ఇంతకీ నన్ను ఎక్కడ ఉండమంటారు?' అని సుధీర్ అడిగాడు. 'నా నుంచి మాత్రం దూరంగా ఉండు' అని మళ్లీ మహేశ్వరి ఇంకో పంచ్ డైలాగ్ వేశారు. ఎపిసోడ్‌లో ఇంకెన్ని పంచ్ డైలాగ్స్ వేశారో? జనవరి 2న తెలుస్తుంది.
Also Read: Sudheer & Rashmi: రావాలి సుధీర్... కావాలి రష్మీ!
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాలో 'ఆశాపాశం...' పాటను 'జబర్దస్త్' ఫేమ్ నూకరాజు పాడటం ఈ ఎపిసోడ్ ఓ హైలైట్ అయితే... పవన్ కల్యాణ్, నిత్యా మీనన్ మీద 'భీమ్లా నాయక్'లో తెరకెక్కించిన 'అంత ఇష్టం' పాటను ఇమ్మాన్యుయేల్ ఫిమేల్ వాయిస్‌లో పాడటం మరో హైలైట్. అందులో మేల్ వాయిస్ లిరిక్స్ కూడా ఆయనే పాడారు.
Sridevi Drama Company Latest Promo:





Also Read: బికినీలో సమంత... న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్ అక్క‌డేనా!?
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: టికెట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్!
Also Read: 'నువ్ లేకపోతే నేను లేను..' బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి