పరంధామయ్య తులసి ఇంటికి రావడంతో అనసూయ వచ్చి గొడవ పడుతుంది. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పరంధామయ్య అంటాడు. కానీ అనసూయ మాత్రం వెళ్ళను అని తెగేసి చెప్తుంది.


అనసూయ: మీ కారణంగా నా జీవితం నాశనం అయ్యింది


పరంధామయ్య: నీ జీవితాన్ని ఎవరు నాశనం చెయ్యలేదు, నీకు నువ్వే నాశనం చేసుకున్నావ్


అనసూయ: కాదు సగం మీ వల్ల అయితే మిగతా సగం నీ కూతురు వల్ల నాశనం అయ్యింది


పరంధామయ్య: చేతులు జోడించి వేడుకుంటున్నా ఇక్కడ నుంచి వెళ్లిపో అనసూయ


అనసూయ: చేతులు జోడించినా, కాళ్ళు పట్టుకున్న ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు


తులసి అనసూయ దగ్గరకి వెళ్ళి మాట్లాడుతుంది. కానీ అనసూయ మాత్రం కోపంగా తనని తోసేస్తుంది. మీరు కాదు దాన్ని చెప్పమనండి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అని అనసూయ అంటుంది. భర్తగా, తండ్రిగా పిల్లలకి ఏమి చేయలేదని పరంధామయ్యని అనసూయ దారుణంగా అవమానిస్తుంది.


Also Read: అనసూయ మీద చెయ్యెత్తిన పరంధామయ్య- ఉగ్రరూపం దాల్చిన తులసి


అనసూయ: నా కొడుకు పార్ట్ టైమ్ జాబ్ చేసి చెల్లెల్ని చదివించాడు. డబ్బులు సంపాదించడం చేతకాదు, నా కొడుకు సంపాదన వల్లే ఇంటిని లాక్కొచ్చాను, కూర్చుని కబుర్లు చెప్పడానికి పనికివస్తారు. మీరు మీ కొడుకుని శత్రువులా చూస్తారు కానీ వాడిది ఎంత పెద్ద మనసో తెలుసా నాన్న అని మీ వెంట తిరుగుతూ ఉంటాడు. మీ కొడుకు మంచితనం తెలుసుకోండి


తులసి: మీరు, మీ కొడుకు ఈ ఇంటికోసం కష్టపడ్డారు కాదనడం లేదు కానీ మావయ్యని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఆయన సంపాదించే చెయ్యి పెద్దది కావొచ్చు కానీ ఆయన మనసు గొప్పది


అనసూయ: మాట్లాడకు నేను మా ఆయనతో మాట్లాడుతున్నా.. భర్తగా, తండ్రిగా అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు చేతకాని వాళ్ళే


సామ్రాట్: పచ్చడి మెతుకులు పెట్టి అయినా మీ కడుపు  నింపారు, భర్త కూడా మనిషే భార్య అర్థం చేసుకోవాలి


అంకిత: పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు, మీరు తాతయ్యతో ప్రవర్తించినట్టు నేను అభితో ప్రవర్తిస్తే ఏమవుతుంది


ప్రేమ్: లాస్య మీ కోడలే కదా మీలాగే ప్రవర్తిస్తే


అభి: ఇంక చాలు కూల్ అవు తాతయ్యని అలా అనడం బాగోలేదు


మాధవి: మా నాన్నని అన్ని మాటలు అంటే ఒప్పుకోను గొడవకు దిగుతాను


Also read: యష్ చెంప పగలగొట్టిన మాలిని- మాళవిక మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పేసిన వేద


ప్రేమ్ ఆపేందుకు చూస్తుంటే అనసూయ వెళ్ళి చెంప పగలగొడుతుంది. మీరందరూ నా ఇంటిని ముక్కలు చేస్తున్నారు, అసలు ముందు ఈ ఇంటిని నాశం చేస్తాను అని తులసి ఇంట్లో సామాను అంతా పగలగొడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినదు.


అనసూయ: ఇక నుంచి మీరు  మాటలు లేని మూగ బొమ్మలా ఇంట్లో ఒక మూలన పడి ఉండాలి. నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ విమర్శిస్తూ ఒక్క మాట కూడా మీ నోటి నుంచి రావడానికి వీల్లేదు. ఇక నుంచి మన ఇంట్లో నా రాజ్యమే చెల్లుతుంది, నేను ఏం చెప్పినా మీరు సరే అని తల ఊపాల్సిందే. పదండి మన ఇంటికి ఇక నుంచి తులసి ఇంటికి రావడానికి వీల్లేదు


పరంధామయ్య: నేను ఆ ఇంటికి రాను, నాకు రావాలని లేదు నేను రాను, నేను మంచి భర్తని కాదు మంచి తండ్రిని కాదు అన్నప్పుడు ఆ ఇంట్లో నాకు చోటు కూడా ఉండకూడదు. సంవత్సరాల తరబడి నీకు ప్రేమని, గౌరవాన్ని ఇచ్చాను. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది ప్రేమకి విలువ లేదు డబ్బుకి తప్ప. ఈ వయస్సులో నాకేమీ మిగల్లేదు కన్నీళ్ళు తప్ప, నీ దగ్గర ఉండటం కంటే గుడి దగ్గర అయిన అడుక్కుని తింటాను, నేను ఇంటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అని కూలబడిపోతాడు


అనసూయ: మీ నాటకాలు ఆపండి పదండి ఇంటికి


తులసి: అత్తయ్యా.. మీ నోటి నుంచి ఒక మాట వస్తే అన్ని మర్యాదలు పక్కన పెట్టేస్తా, మీకు మాత్రమే కోపం ఉందనుకుంటున్నారా నాకు పిచ్చెక్కితే ఎలా ఉంటుందో చూస్తారా? అయితే మావయ్య గురించి మాట్లాడి చూడండి


నేను చాలా అదృష్టవంతురాలిని ఇద్దరు తండ్రుల ప్రేమ పొందాను, నాకు నా మావయ్య తండ్రి కంటే ఎక్కువ. మీ కూతురు ఇంకా బతికే ఉంది మావయ్య. ఇప్పుడు నా ఇల్లు మావయ్యకి ఇస్తాను


పరంధామయ్య: ఆ ఇంటికి పంపవు కదా


తులసి: అసలు పంపించను, ఇది మీ ఇల్లు, మన ఇల్లు