యష్ లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడటం మాలిని వింటుంది. రాత్రి యష్ చేసిన గొడవ గురించి చిత్ర సులోచనకి చెప్తుంది. ఆ విషయం విని ఏదో ఒకటి తేల్చేస్తాను అని యష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే మాలిని యష్ చెంప పగలగొడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంకొక్క మాట మాట్లాడిన ఊరుకొను అని మాలిని తిడుతుంది.


మాలిని: నీ భార్యని వదిలేసి ఆ మాళవికతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావ్. అది నీచురాలు, ఎంతకైన దిగజారుతుంది. సులోచన మన ఇంటి వియ్యపురాలు, వేద అమ్మ. చీమకి కూడా హాని చేయని ఒక మంచి మనిషి. అలాంటి మనిషిని కారుతో గుద్ది చంపాలని చూసింది. ఇప్పుడు నీ కాపురంలో నిప్పులు పొయ్యాలని చూస్తుంది. ఖుషిని మన నుంచి మళ్ళీ లాగేసుకోవాలని కుట్రలు చేస్తుంది. అది ఎంత నీచురాలో నీకే బాగా తెలుసు. అలాంటి దాన్ని కాపాడాలని చూస్తావా, అసలు నిజం మా దగ్గర దాచాలని చూస్తావా, ఇప్పటి కూడా అది ఆడించినట్టు ఆడతావా. ఈ వేద నీ భార్య దీని సంగతి ఏంటి, నీకోసం నీ కూతురు కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది, అలాంటి వేదకి అన్యాయం చేసి క్షోభ పెడతావా. ఈరోజు నీ తల్లిగా చెప్తున్నా మన కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం వేద. ఈ ఫ్యామిలీ మొత్తం వేదకి అండగా ఉంటుంది. ఒక వేళ నువ్వో వేద తేల్చుకోవాల్సి వస్తే మాకు నీకంటే వేదనే ముఖ్యం.  మేము నీకు అపొజిట్ గా కేసు పెట్టి సులోచనకి న్యాయం చేస్తాం, నువ్వే నిర్ణయించుకో మా వైపు ఉంటావో ఆ మాళవిక వైపు ఉంటావో. ఈ వేద నా కూతురు అని గొప్పగా చెప్పుకుంటాను.


Also Read: శౌర్యని కలిసిన సౌందర్య, దీప-కార్తీక్ ను తప్పుదారి పట్టించిన మోనిత


సులోచన వెళ్ళిపోవడం చూసి మాలిని పలకరిస్తుంది. ఈ ఇంట్లో నా బిడ్డకి మరో అమ్మని చూశాను అని సులోచన మాలిని చేతులు పట్టుకుని థాంక్స్ చెప్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. వేద కొత్త లాయర్ ని పెట్టిందని సులోచనకి మాలిని చెప్తుంది. మనం అందరం వేదకి సపోర్ట్ గా నిలబడాలని అంటుంది. ఈ వేద మామూలుది కాదు తెలివిగా తమ్ముడిని విలన్ చేసింది, నేను యష్ వైపే ఉంటాను, ఆ వేదని ఓడించడానికి చేయాల్సింది చేస్తాను అని కాంచన మనసులో అనుకుంటుంది. యష్ జరిగింది తలుచుకుని చాలా ఫీల్ అవుతాడు. నిజం చెప్పలేను అలా అని చూస్తూ ఉండలేను, దీంతో నా కొడుకు భవిష్యత్ ఆధారపడి ఉంది, ఎలా అయిన ఈ కేసుని విత్ డ్రా చేసుకోమని ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉండగా వేద వస్తుంది.


‘నాకోసం నన్ను చూసి ఈ కేసు విత్ డ్రా చేసుకో’ వేద ప్లీజ్ అని యష్ అడుగుతాడు. మీ కోసం ఏమైనా చేస్తాను కానీ ఇది తప్పా అని వేద అంటుంది. పొరపాటున యాక్సిడెంట్ చేసి ఉంటే రోడ్డు మీద మా అమ్మ పడి ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించలేదని వేద యష్ ని అడుగుతుంది. మీకోసం నేను ఒడిపోవడానికి సిద్ధమే కానీ మిమ్మల్ని ఒడిపోవడానికి కాదని వేద ఎమోషన్ గా చెప్తుంది.


Also Read: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు!