గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 17th  Today Episode 610)


ఫణీంద్ర ఊరునుంచి వస్తాడు..రిషితో మాట్లాడతాడు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మీరు వెళ్లిన పని ఏమైంది పెదనాన్న అని అడిగితే.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అక్కడి వాళ్ళతో మాట్లాడాను వారు చాలా ఆసక్తిగా ఉన్నారు అని అంటాడు ఫణీంద్ర. అందుకు సంబంధించిన వివరాలు మనకు తొందర్లోనే తెలుస్తాయి రిషి అని అంటాడు. అప్పుడు ఫణీంద్ర రిషి నువ్వు మహేంద్ర వాళ్ళ గురించి బాధపడకు ఎందుకు వెళ్లిపోయారు అనేదానికంటే ఏం చేస్తే ఇంటికి వస్తారు అన్న విషయం గురించి నిదానంగా ఆలోచించు అని చెబుతాడు.


వసు-రిషి:  వసుధార..రిషితో అన్న మాటలు తల్చుకుని ఆలోచిస్తుంటుంది. ఇంతలో రిషి భోజనం తీసుకుని వస్తాడు. నాకు ఆకలిగా లేదు సార్ అని అనడంతో వసుకి తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు వసు తాను తింటూ రిషికి కూడా తినిపిస్తుంది. అప్పుడు రిషి కూడా వసుధార కి తినిపిస్తాడు. వారిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి చేతులు కడుక్కున్న తర్వాత వసుధర తన చున్నీని తుడుచుకోవడానికి ఇస్తుంది. ఇప్పుడు రిషి నువ్వు ఇంకెప్పుడూ ఏడవకు వసుధార ప్లీజ్..గుడ్ నైట్ అనేసి వెళ్లిపోతాడు. అప్పుడు వసుధార మనసులో గుడ్ నైట్  జెంటిల్మెన్ అని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రిషి తన రూమ్ కి వెళ్లి వసు అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అప్పుడు జగతి ని తలచుకున్న రిషి మేడం నాకు మీ మీద చిన్నప్పటి నుంచి కోపం ఉందేమో వసుధార అంటే మీకు ఇష్టమే కదా అలాంటప్పుడు ఎందుకు విడిచి వెళ్లారు అని అనుకుంటూ ఉంటాడు రిషి. 


Also Read: శౌర్యని కలిసిన సౌందర్య, దీప-కార్తీక్ ను తప్పుదారి పట్టించిన మోనిత


దేవయాని-ఫణీంద్ర..గౌతమ్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడు వచ్చిన రిషి... వసుధార సాధించిన విజయానికి ఇంటర్యూ చేస్తున్నారంటాడు. అప్పుడే కాఫీ తెచ్చిన వసుధారపై దేవయాని సెటైర్స్ వేస్తుంది.
దేవయాని: ఏం వసుధార ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా..జగతి వాళ్ళు లేరు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది
వసుధార: నేను ఎప్పటికీ మేడం ని మిస్సవను..తను నా మనసులోనే ఉంటారు..మేడం ఎక్కడున్నా తన ఆశీస్సులు నాకుంటాయి..అయినా ఇంటర్యూకి మేడం వస్తున్నారు కదా...ఆ మాట వినగానే అక్కడున్నవారంతా షాక్ అవుతారు... మేడం వాళ్లు ఎలాగైనా వస్తారని రిషి సార్ అన్నారు..ఆయన ఓ మాట అన్నారంటే ఊరికే అనరు అది నిజం అవుతుంది.. ఆ నమ్మకం నాకుంది
ఫణీంద్ర: నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నానమ్మా
దేవయాని: ఏదో నీ కన్నీళ్లను చూడలేక రిషి అలా అని ఉంటాడు..వాళ్లెక్కడి నుంచి వస్తారు అదంతా నీ భ్రమ
గౌతమ్: అంకుల్ వాళ్లు ఎక్కడున్నారో తెలుసా..వస్తారని అంత నమ్మకంగా చెబుతున్నావేంటి...
రిషి: చూస్తుండు...


Also Read: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు!


అక్కడ జగతి మెయిల్ చెక్ చేసుకుంటుంది.. రిషి నుంచి మెయిల్ వస్తుంది..అది చూసి మురిసిపోతుంది.. రిషి పక్కనే ఉండి చదివి వినిపిస్తున్నట్టు భావించుకుంటారు.. 
రిషి మెయిల్ లో: మీరు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లారో నాకు ఇప్పటికీ తెలియదు, నాకు ఎందుకంత శిక్ష పడిందో నాకు తెలియదు..ఇప్పుడు మీరు అదే శిక్ష వసుధారకి వేస్తున్నారు..డాడ్ ఆనందం కోసం ఒక మెట్టు దిగి నేను మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను. వచ్చినట్టే వచ్చి డాడీని తీసుకొని వెళ్ళిపోయారు. ఇది మీకు న్యాయం కాదుకదా మేడం..ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలియదు..మీరెలా ఉన్నారో అని ప్రతిక్షణం టెన్షన్ పడుతున్నాను కానీ మీ ఇద్దరి వైపునుంచి సమాచారం లేదు..మినిస్టర్ గారి దగ్గర్నుంచి కావాలనే నాకు కనిపించకుండా వెళ్లారు..అది నాకు ఎంతో బాధకలిగించిన విషయం కానీ..ఇప్పుడు ఈ బాధ నా ఒక్కడిదే కాదు వసుధారది కూడా..వసు యూనివర్శిటీ టాపర్ అయ్యాక కూడా మీరు ప్రత్యక్షంగా అభినందించాలని ఎందుకు అనుకోవడంలేదో అర్థం కావడం లేదు..మీడియా ఇంటర్యూ సమయంలో మీరుంటే బావుంటుందని తను ఆశపడుతోంది..తన కోరికను మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను..
తల్లి వదిలేసి వెళ్లిన కొడుకు ప్రార్థన అనుకుంటారో
గురువు వదిలేసి వెళ్లిన శిష్యురాలి బాధ అనుకుంటారో..
వసు కళ్లలో సంతోషం చూడాలని డాడ్ తో కలసి మీరు కాలేజీకి వస్తారని ఎదురుచూస్తున్నాను... అని ముగిస్తాడు..
రిషి మెయిల్ చూసి జగతి ఆనందపడుతుంటే..రిషి నిన్ను అమ్మగా రమ్మని చెప్పడం లేదు వసుధారకి ఇంటర్వ్యూ చేస్తుంటే తనకు సపోర్టుగా ఉండటం కోసం నేను రమ్మంటున్నాడంటాడు. 
జగతి: నాకు వెంటనే వెళ్లి పోవాలని ఉంది మహేంద్ర
మహేంద్ర: వారి పెళ్లి విషయం ప్రకటించే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్లేది లేదు 
జగతి: ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి చాలా ఫీల్ అవుతాడు 
మహేంద్ర: ఇప్పుడు మనం వెళ్లలేం..