తులసి, సామ్రాట్ నవ్వుతూ మాట్లాడుకోవడం ప్రేమ్ చూస్తాడు. వాళ్ళు సంతోషంగా ఉండటం చూసి ప్రేమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పరంధామయ్య పుట్టినరోజు సందర్భంగా నందు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమని అనసూయ చాలా ఎమోషనల్ గా అడుగుతుంది. ఈ బట్టలు వేసుకోకపోతే నాన్న అనే పిలుపు వాడికి దూరం చేసినట్టే అని అనసూయ అనడంతో పరంధామయ్య ఆ బట్టలు తీసుకుంటాడు. తాను ఇచ్చిన కొత్త బట్టలు తీసుకున్నారని అనసూయ లాస్య దగ్గరకి వచ్చి సంబరంగా చెప్తుంది. తులసిని ఇంటి చుట్టుపక్కలకి కూడా రానివ్వను అని అనసూయ అంటుంది. పరంధామయ్య బట్టలు తీసుకునే సరికి అనసూయ తెగ హడావుడి చేస్తుంది.


ఈ గుడ్ న్యూస్ వెంటనే నందుకి చెప్పి క్రెడిట్ కొట్టేయాలని సంకలు గుద్దుకుంటుంది. లాస్య ఫోన్ చూసి నందు లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. లిఫ్ట్ చేస్తే ఎక్కడ ఉన్నావ్ ఎప్పుడు వస్తావ్ అని తిక్క ప్రశ్నలు వేస్తుంది. నాన్న మారాలి అంటే తులసి అయినా ఇంటికి రావాలి, నాన్న అక్కడికి వెళ్ళాలి ఇవి రెండు జరగవు. తులసి గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నా అని నందు అనుకుంటాడు. తులసి, సామ్రాట్, ప్రేమ్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్రాట్ గురించి తులసి చాలా వెటకారం చేస్తుంది. తులసి ఇంట్లో పూజకి ఏర్పాట్లు చేస్తుంది. పరంధామయ్య నిండు నూరేళ్ళు బాగుండాలని తులసి పూజ ఇంట్లో చేయిస్తుంది. ముందే చెప్పి ఉంటే తాతయ్యని తీసుకొచ్చే వాడిని కదా అని ప్రేమ్ అంటాడు.


Also Read: ఊహించని ట్విస్ట్, వేద కేసులో ఒడిపోవాలంటున్న యష్- యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదా?


అటు అనసూయ, లాస్య కూడా పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మావయ్య గారు నిజంగా మీరు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుంటారా అని అనుమానం పెడుతుంది. నిజమే అనుకుని అనసూయ చూడటానికి వెళ్లబోతుంటే పరంధామయ్య వస్తాడు. అందరూ ముఖాలు మాడ్చుకుని పూజ దగ్గర ఉంటారు. అనసూయ సంతోషంగా పూజ చేసి పరంధామయ్యకి బొట్టు పెడుతుంది. ఇంతలో మాధవి వస్తుంది. జరిగిన గొడవ మర్చిపోయి ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అనసూయ మాధవిని పలకరిస్తుంది. తను వెళ్ళి తండ్రికి విసెష్ చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది.


లాస్య కూడా పలకరిస్తుంది కానీ మాధవి కౌంటర్ వేస్తుంది. లేట్ అవుతుంది బయల్దేరదామా అని మాధవి అంటుంది ఎక్కడికి అని అనసూయ అడుగుతుంది. తులసి దగ్గరకి అని చెప్పేసరికి అనసూయ ఫైర్ అవుతుంది. నేను మీ భార్యని ఉండాల్సింది నా దగ్గర అని బాధగా అడుగుతుంది. మీరు వెళ్ళడానికి వీల్లేదని అంటుంది. పరంధామయ్యతో కలిసి తులసి బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది. ఇక మనం అంతా కలిసి పండుగలు వేడుకలు జరుపుకునే రోజులు పోయాయని అభి అంటే లాస్య కూడా ఇదంతా తులసి వల్లే అని ఎక్కిస్తుంది. తులసి, ప్రేమ్ పూజలో కూర్చుని ఉంటారు. పూజ ఎవరి కోసం చేస్తున్నారో ఆయన్ని రమ్మని పూజారి చెప్తాడు. ఆయన అందుబాటులో లేరని తులసి చెప్తుంది. కానీ అప్పుడే బ్యాచ్ అంతా తులసి ఇంటికి వస్తుంది. తనని చూసి తులసి సంతోషిస్తుంది.


Also Read: దీప-కార్తీక్ ను సౌందర్య చూస్తుందా,ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!


తరువాయి భాగంలో..


తులసి ఇంటికి అనసూయ వచ్చి నోటికి వచ్చినట్టు తిడుతుంది. మీ మావయ్యని ఎందుకు దూరం చేస్తున్నావ్ అందుకే నీకు దేవుడు దిక్కూ మొక్కు లేని జీవితం రాశాడాని అంటుంటే పరంధామయ్య కోపంగా అనసూయ మీదకి చెయ్యి ఎత్తుతాడు.