అంకితకి హాస్పిటల్ లో ఉద్యోగం ఇప్పించి తన వైపుకి తిప్పుకోమని గాయత్రి సలహా ఇస్తుంది. ఇంట్లో అభి, అంకిత గొడవపడుతూ ఉండటం తులసి వింటుంది. ఏమైందని అడుగుతుంది. మా హాస్పిటల్ లో బంగారం లాంటి జాబ్ ఆఫర్ తీసుకొచ్చాను చేరను అంటుందని అభి చెప్తాడు. కార్పొరేట్ హాస్పిటల్ లో జాబ్ చేయడం ఇష్టం లేదని అంకిత అంటుంది. ఇద్దరం కలిసి ఒకేచోట జాబ్ చేస్తే బాగుంటుంది కదా, ఇద్దరం వేరే చోట జాబ్ చేయడం వల్ల కలిసి మాట్లాడుకోవడం కూడా జరగడం లేదు. పేరుకే భార్యాభర్తలుగా ఉంటున్నాం కానీ నిజంగా కాదు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామంటే అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుందని అభి అంటాడు. అభి బాధలో నిజం ఉంది అర్థం చేసుకోమని తులసి అంకితకి సర్ది చెప్తుంది. దీంతో అంకిత అభితో పాటు వెళ్ళిపోతుంది.


Also Read: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు


నందు విషయం తేలడంతో ఇంట్లో అంతా సంతోషంగా ఉందని పరంధామయ్య అంటాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అందరూ సంతోషంగా ఉన్నారు నందు బిజినెస్ లో సెటిల్ అయితే ఎంజాయ్ చేయవచ్చని లాస్య అనుకుంటుంది. ముందు ఉత్తమ ఇల్లాలు ఎలా అవాలా అని ఆలోచిస్తుంది. చాలా రోజుల తర్వాత సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. తులసి జాబ్ చాలా బాగా చేస్తుందని మెచ్చుకుంటాడు. కాసేపు వేదాంతం మాట్లాడుతుంది. నందు కేఫే పెట్టించాలని ఐడియా ఇచ్చారట కదా అని అంటాడు. డబ్బులతో కూడిన విషయం కదా అని తులసి అంటుంది. తన ఫ్రెండ్ ఒకతను కేఫే మూసేస్తున్నాడని అందులోని ఫర్నిచర్ మీరు తీసుకోవచ్చు కదా అని సామ్రాట్ సలహా ఇస్తాడు. తీసుకోవచ్చు కానీ డబ్బు అంతా ఒకేసారి కట్టడం అంటే కష్టమవుతుందని తులసి అనేసరికి ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చులో మీ మాజీ మొగుడుకి సహాయం చేయనివ్వండి చరిత్రలో నిలిచిపోతానని సామ్రాట్ అంటాడు.


ఇంట్లో కేఫే పెట్టడానికి నందు బడ్జెట్ ప్రిపేర్ చేస్తాడు. తక్కువలో తక్కువ రూ.5 లక్షలు అవుతుందని చెప్తాడు. అంత డబ్బు అంటే ఎక్కడ నుంచి వస్తాయని లాస్య అంటుంది. అప్పుడే అంకిత, అభి కూడా వస్తాడు. ఈ ఇంట్లో నీకు సహాయపడే కెపాసిటీ అభికి మాత్రమే ఉందని లాస్య అంటుంది. తన దగ్గర ఎక్కడ ఉన్నాయని అభి అంటాడు. నీకు పిల్లనిచ్చిన అత్త దగ్గర ఉన్నాయి కదా అని అంటే అడిగితే ఇస్తుంది కానీ ఆమె కండిషన్ ఒకటి ఉంది. నేను అంకిత ఆమె ఇచ్చిన ఇంట్లో విడిగా ఉండాలని అభి చెప్తాడు. అందులో ఏం ప్రాబ్లం కనిపించలేదని నందు అంటాడు. ప్రేమ్ మాత్రం వద్దు అందరం కలిసి ఉండటం అమ్మ కోరిక విడిపోవద్దని అంటాడు. అప్పుడే తులసి వస్తుంది.


Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్


సామ్రాట్ ఫ్రెండ్ ఒకరు కేఫే క్లోజ్ చేస్తున్నారట ఆ సామాను మనకి ఇప్పిస్తా అన్నారని చెప్తుంది. లాస్య సామ్రాట్ హెల్ప్ అంట తీసుకుంటావా అని అంటుంది. ఆయన మాట సాయం మాత్రమే చేస్తున్నారు డబ్బు మాత్రం మీ ఆయనే కట్టాలని తులసి అనేసరికి లాస్య షాక్ అవుతుంది. నందు ఇక ఏమి చేసేది లేక తులసి ఆఫర్ కి ఒప్పుకుంటాడు. ఇంట్లో నుంచి తీసుకువెళ్లాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నావ్అని అంకిత అభిని నిలదిస్తుంది. ఇంట్లో డబ్బు అవసరం చూశావ్ కదా అందుకే అని అభి అంటాడు. అందుకని నన్ను అమ్మేస్తావా అని అంకిత సీరియస్ అవుతుంది. ఇంట్లో పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఇలా చేస్తావా నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవా అని అంకిత బాధపడుతుంది. దీంతో అభి తనకి సోరి చెప్తాడు.రానురాను ఈ ఇంటితో నీకు బంధం మరింత బలపడుతుంది, నేను ఎదగాలంటే తెంపాల్సిందేనని అభి మనసులో అనుకుంటాడు. తులసి అండ్ కో మొత్తం కేఫే పెట్టె స్థలం దగ్గరకి వస్తారు.


తరువాయి భాగంలో..


అందరూ కేఫే కి కావాల్సిన వస్తువుల గురించి లిస్ట్ రాస్తుంటే అభి కోపంగా వస్తాడు. ఇడ్లీ వడ సాంబార్ పెట్టుకోవడానికి ఇదేమైనా కాకా హోటల్ నా అని సీరియస్ అవుతాడు. అంకిత అభిని మాట్లాడొద్దు అనేసరికి నువ్వు అమ్మని ఫాలో అయితే మన కాపురం కూడా వాళ్ళ కాపురంలాగా ముక్కలు అవుతుంది, విడాకులు దాకా వెళ్తుందని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటకి తులసి చాలా బాధపడుతుంది.