నందు కొడుకులు చేసిన అవమానం తలుచుకుని రగిలిపోతూ తనని తాను హింసించుకుంటాడు. అది చూసి తులసి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి సానుభూతి పొందటం కోసం ఇలా చేస్తున్నారని నిలదీస్తుంది. చేతికి గాయం చేసుకుంటే గుండెకి గాయం తగ్గిపోతుందా? అని అంటుంది. నా ఏడుపు ఏదో నన్ను ఏడవనివ్వు అని నందు అంటాడు. నేనేమీ మీ మీద ప్రేమతో మన మధ్య బంధం ఏదో ఉందని అనుకోవద్దు. మన పాతికేళ్ళ బంధం ఎప్పుడో గాలికి వదిలేశాను. నాకు చెప్పడం ఇష్టం లేకపోతే మీ ఆవిడని పంపిస్తానని తులసి వెళ్లబోతుంటే ఆపుతాడు.


నందు: నా మీద నా కొడుకులకు ప్రేమ లేదు నమ్మకం లేదు, నాకు వాళ్ళకి ఏం సంబంధం ఉందని వాళ్ళు నా నుంచి నేర్చుకోవడానికి


తులసి: సహాయం చేస్తేనే వాళ్ళు మీ పిల్లలా లేకపోతే కాదా?మన డైవర్స్ అయిన తర్వాత మీరు వాళ్ళకి ఏం ఇచ్చారు ఏం చేశారు? అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నారు గౌరవం ఇస్తున్నారు కానీ మీరు బంధం వద్దని అనుకుంటున్నారు


నందు: నా పిల్లల మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నా బాధ అంతా నా గురించి మీ అందరి ముందు విలువ పోగొట్టుకుంటున్నా


Also Read: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్


తులసి: అదే మాట ఎన్ని సార్లు చెప్తారు. మీరు చేయాలనుకునే బిజినెస్ కి సంబంధించి పెట్టుబడి మీ దగ్గర లేనప్పుడు మీకు అందుబాటులో ఉండే బిజినెస్ చేసుకోండి


నందు; సాఫ్ట్ వేర్ తప్ప నాకు ఇంకేం వచ్చు


తులసి: కొన్ని రోజులు కేఫ్ లో పని చేశారు కదా అందులో అనుభవం కూడా వచ్చింది సొంతంగా కేఫ్ పెట్టుకోవచ్చు ఏమో ఆలోచించండని చెప్పేసి వెళ్లిపోతుంటే ఎదురుగా లాస్య ఉంటుంది. అడగకుండా సలహా ఇవ్వడం నీకు ఏమైనా జబ్బా అని తనని కాసేపు తిడుతుంది. నా మీద పడి ఏడవడం ఆపి ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటానని అన్నావ్ కదా అది చూడమని గట్టిగా చెప్పేసి తులసి వెళ్ళిపోతుంది. కేఫే స్టార్ట్ చేస్తానని నందు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. అది విని పరంధామయ్య సంతోషంగా ఉందని అంటాడు. ఆలోచన బాగుంది కానీ మరి డబ్బు పెట్టుబడి ఎలా అని అందరూ అంటారు. కేఫే స్టార్ట్ చేయడం కోసం స్థలం కావాలి కదా ప్రేమ్ మ్యూజిక్ స్కూల్ పక్కన చాలా ఖాళీ స్థలం ఉంటుంది కదా అందులో పెట్టుకోవచ్చని తులసి సలహా ఇస్తుంది.


Also Read: మనసు భారమైన వేళ జ్ఞాపకాలు బరువయ్యాయి- రిషిధారని కలిపిన కాగితపు పడవలు


ఈ ప్రపోజల్ నచ్చలేదని లాస్య అంటుంది. సాఫ్ట్ వేర్ జాబ్ పక్కన పెట్టి కేఫ్ వైపు ఎందుకు వెళ్ళడం ఒక వేళ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితని లాస్య అంటుంది. నందు లాస్యకి గట్టిగా బుద్ధి చెప్తాడు. దీంతో లాస్య నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని విసురుగా వెళ్ళిపోతుంది. ప్రేమ్ కూడా కోపంగా వెళ్తాడు. చిరాకుగా ఉన్న ప్రేమ్ దగ్గరకి తులసి వెళ్తుంది. తులసి ఇచ్చిన సలహా కరెక్ట్ కాదని ప్రేమ్ కోపంగా అంటాడు. నా మ్యూజిక్ స్కూల్ పక్కన కేఫే పెట్టుకోవడం ఇష్టం లేదని ప్రేమ్ తెగేసి చెప్తాడు. తులసి సర్ది చెప్తుంది. ఆయన నీకు జన్మనిచ్చారు రుణం తీర్చుకో. మనిషికి జాలి ఉండవచ్చు కానీ పరిమితి ఉండాలి. నాన్న క్రూర మృగంలా బిహేవ్ చేస్తారు. ఒక్కో క్షణం ఒక్కోలా కనిపిస్తారు ఆయన్ని నమ్మలేనని ప్రేమ్ అంటాడు. ఎందుకు ఆయన్ని నమ్ముతున్నావ్ అని ప్రేమ్ నిలదీస్తాడు. ఎందుకంటే ఆయన నా పిల్లలకి తండ్రి అని తులసి అంటే.. నీతో తెగదెంపులు చేసుకున్నప్పుడే నాన్న అనే బంధాన్ని తెంచేసుకున్నామని ప్రేమ్ అంటాడు. కొడుకు పరిస్థితి చూసి పరంధామయ్య, అనసూయ బాధపడతారు.