ముగ్గుల పోటీలో వేద గెలుస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. చిత్ర, ఖుషి డాన్స్ చేస్తూ ఉంటే వేద కంగారుగా వచ్చి ముగ్గుల పోటీలో గెలిచిన రూ.50 వేలు కనిపించడం లేదని అంటుంది. నేనే తీశానని యష్ డబ్బులు తీసుకుని వస్తాడు. అసలు ప్రైజ్ మనీ పెట్టింది నేనే, ఎందుకో తెలుసా ఈ పోటీలో వేదనే గెలుస్తుందని తెలుసు ఆ డబ్బులు మళ్ళీ ఇంటికే వస్తాయని తెలుసు అందుకే పెట్టాను అని అంటాడు. వేద ఆ మాటకి బుంగమూతి పెట్టి ఆ డబ్బులతో అత్తయ్య మీకు అందరికీ గిఫ్ట్స్ కొందామని అనుకున్నా ఇప్పుడు లేవు అని అంటుంది. మాలిని యష్ చేతిలో డబ్బులు బలవంతంగా తీసుకుని వేదకి ఇచ్చేస్తుంది. అవి తీసుకుని వేద నవ్వుతుంది. షాపింగ్ కి ఎప్పుడు వెళ్దామని మాలిని అంటే సోరి అత్తయ్య ఈ డబ్బులు అనాథ పిల్లలకి ఖర్చు పెట్టమని ఖుషి ఐడియా ఇచ్చింది అందుకే మీకు అబద్ధం చెప్పి మీ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్న అని చెప్తుంది. ఆ మాట విని అందరూ సంతోషిస్తారు.


Also Read: మనసు భారమైన వేళ జ్ఞాపకాలు బరువయ్యాయి- రిషిధారని కలిపిన కాగితపు పడవలు


మాళవిక, భ్రమరాంబిక ఇద్దరూ తమకి జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతారు. ఆ ముగ్గుల పోటీ దగ్గర ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగబోతుందని ఖైలాష్ అభితో అంటాడు. అప్పుడ భ్రమరాంబిక అభిని పిలుస్తుంది. అమెరికాలో ఉన్న నా కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడివి నువ్వు. అలాంటి వాడివి ఇద్దరు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? దాని బతుకు ఎంత అది నన్ను ఎదిరించి మాట్లాడుతుందా? వచ్చే మాఘమాసంలో నీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా ఆస్తి మొత్తం నీ చేతులో పెట్టేస్తా. కానీ పెళ్లి పీటల మీద కూర్చోబోయే అమ్మాయి మాత్రం నాట్ ఫిక్స్. మన స్టేటస్ కి తగినట్టు అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలా, మొగుడు, పిల్లల్ని వదిలేసిన సెకండ్ హ్యాండ్ ఆడది కావాలా నువ్వే నిర్ణయించుకో అని భ్రమరాంబిక అభికి ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఆ మాటలన్నీ మాళవిక విని టెన్షన్ పడుతుంది.


Also Read: కొడుకులని ఆస్తి అడిగిన నందు- ఇవ్వబోమని తెగేసి చెప్పేసిన ప్రేమ్, అభి


శర్మ, రత్నం తాగాలని అనుకుంటారు కానీ పెళ్లాలకి భయపడిపోతారు. అప్పుడే విన్నీ మందు తీసుకొచ్చి తాగుదామని అనేసరికి ఒకే అంటారు. కానీ పెళ్ళాలు వచ్చేసరికి బిక్కమొహం వేస్తారు. సులోచన, మాలిని కోపంగా చూసేసరికి వేద వచ్చి సర్ది చెప్పి కాస్త రిలాక్స్ అవనివ్వండి అని చెప్పి తీసుకెళ్లిపోతుంది. వేద గురించి ఆలోచిస్తూ సులోచనని చూసి అసూయగా ఉందని మాలిని అంటుంది. ఏం పుణ్యం చేసుకుందో ఖుషిలాంటి కూతురు దొరికింది, యష్ లాంటి మంచి మనసున్న భర్త దొరికాడని సులోచన అంటుంది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు పొగుడుకుంటారు. వేదకి తన ఆలోచనే లేదని యష్ తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే వేద వచ్చి డిన్నర్ చేయకుండా పడుకున్నారు ఏంటి రండి అని పిలుస్తుంది. ఆకలిగా లేదని అంటాడు. సరే ఆ స్పెషల్ ఐటెం పనిమనిషికి ఇచ్చేస్తానులే అనేసరికి యష్ లేచి ఏంటది అని ఆత్రంగా అడుగుతాడు. బిర్యానీ మీకు ఇష్టం కదా అని చేశానని చెప్పేసరికి యష్ ఫేస్ వెలిగిపోతుంది.