రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జగతి భోజనం తీసుకుని వచ్చి తలుపు కొడుతుంది. వసు వచ్చిందని అనుకుని ఎందుకు వచ్చావ్ వసుధార అని కోపంగా అంటాడు. ఆ మాటకి నేను జగతిని భోజనం చేయలేదట కదా అని అంటుంది. అసలు వసుధార కాలేజీకి ఎందుకు వచ్చింది నన్ను బాధపెట్టడానికా అని జగతిని నిలదీస్తాడు. నీకు అన్నీ తెలుసు బాధ కూడా గౌరవంగా స్వీకరించాలని అంటుంది. అది బాధ కాదు హింస తను ఎందుకు ఇలా చేసిందో మీకేమైన తెలుసా పెళ్లి చేసుకుని అక్కడ ఎక్కడో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే మీకు తెలిసి కూడా అని రిషి అనబోతుంటే నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసని అంటుంది.


రిషి: మేడమ్ మీరు నాకొక సాయం చేస్తారా, వసుధారని మర్చిపోలేకపోతున్న ఎలా మర్చిపోవాలో చెప్తారా? ఈ మాట మిమ్మల్నే ఎందుకు అడిగానో తెలుసా.. వసు నా మనసులో ఉందని నాకు తెలిసే కంటే మీరు ముందే చెప్పారు. మీకు నా మనసు ముందే తెలిసిందో లేదంటే వసు గురించి చెప్పారా. మీకు అన్నీ తెలుస్తాయి కదా వసుని మర్చిపోయే సాయం చేయండి. తను ప్రాజెక్ట్ వర్క్ కోసమే వచ్చిందా సమాధానం చెప్పండి


జగతి: ప్రతి ప్రశ్నకి సమాధానం వెతుక్కోకపోతేనే మనశ్శాంతిగా ఉంటుంది


రిషి: తను ఎందుకు వచ్చిందో చెప్పలేదా


Also Read: కొడుకులని ఆస్తి అడిగిన నందు- ఇవ్వబోమని తెగేసి చెప్పేసిన ప్రేమ్, అభి


వసు: వసుధారని నువ్వు ఎలా చూస్తున్నావో అది నిన్ను ఎక్కువగా బాధిస్తుంది. వసుధార మీద నీకు ఎలాంటి అంచనాలు లేకుంటే ప్రాజెక్ట్ హెడ్ గా మాత్రమే చూస్తే నీకు అసలు బాధ ఉండదు. నీ మనసులో ఆలోచనల్లో జ్ఞాపకాల్లో వసుధార ఉంటే అది నీ ప్రాబ్లం వసుధారది కాదు కదా


రిషి: నన్ను ఓదారుస్తున్నారా లేదంటే జీవితంలో ఒంటరిగా బతకాలని సిద్ధం చేస్తున్నారా


జగతి: కాలం కొన్నింటికి సమాధానం చెప్తుంది అప్పటి దాకా ఎదురుచూడాలి మనం


రిషి: కాలం సమాధానం చెప్తుందో లేదో తెలియదు కానీ గాయాలు చేసింది


జగతి: నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి


రిషి: నేను కోల్పోయింది ధైర్యం కాదు నమ్మకం అది పోయేలా చేశారు


భోజనం చేసి పడుకోమని జగతి చెప్పి వెళ్ళిపోతుంది. రిషి మాత్రం తనకి వసు తినిపించిన విషయం గుర్తుచేసుకుని బాధపడతాడు. అటు వసు కూడా రిషి గురించి ఆలోచిస్తుంది. రిషి ఫోన్లో వసు మెసేజ్ చూస్తూ నిన్ను ఎలా మర్చిపోవాలో నువ్వు అయినా చెప్పు అని పొరపాటున చెయ్యి తగిలి ఖాళీ మెసేజ్ పంపిస్తాడు. అది చూసి వసు సంతోషపడుతుంది. కానీ అందులో ఏమి ఉండదు. రిషి సర్ పాత మెసేజ్ లు చదువుకుంటూ ఇలా ఖాళీ మెసేజ్ పంపించారా ఏంటి అని వసు ఆలోచిస్తూ ఉండగా చక్రపాణి వచ్చి పలకరిస్తాడు. వసు ఊహాల్లోనే రిషి ఉండిపోతాడు. తనతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుని బాధపడతాడు.


Also Read: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్


రిషి బయటకి వెళ్లబోతుంటే మహేంద్ర ఎక్కడికని అడుగుతాడు. నేనేమీ చిన్న పిల్లాడిని కాదు కదా అని అంటాడు. తనతో పాటు వస్తానని మహేంద్ర అంటాడు. సరే రమ్మని అంటాడు. జగతి నేను కూడా వస్తానని రిషిని అడుగుతుంది. అటు వసు తండ్రి చక్రపాణిని తీసుకుని రిషితో వెళ్ళిన చెరువు దగ్గరకి తీసుకుని వెళ్తుంది. మనసులో కోరికలు పేపర్ మీద రాసి గంగమ్మ తల్లికి వదిలితే కోరికలు తీరతాయని చెప్తుంది. అదే చెరువు దగ్గరకి రిషి మహేంద్ర వాళ్ళని తీసుకొస్తాడు. తన చేతిలో పేపర్స్ చూసి ఎందుకని అడుగుతాడు. పడవలు చేసి వాటి మీద కోరికలు రాసి వదిలితే నెరవేరతాయని వసు చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. చెరువుకి ఓ వైపు రిషి, మరోవైపు వసు కూర్చుని పడవలు చేసి వదులుతారు. రిషి సర్ నేను మళ్ళీ కలిసి రిషిధారలుగా మారాలని వసు కోరుకుంటూ కాగితపు పడవ వదులుతుంది. వసుధార కోరుకున్నది జరగాలని రిషి మనసులో అనుకుంటాడు. ఇద్దరు వదిలిన పడవలు ఒకదగ్గరకి చేరడంతో రిషి, వసు ఒకరినొకరు చూసుకుంటారు.