వేద ముగ్గుల పోటీలో పాల్గొంటుంది. చివర్లో ముగ్గుకి వేయాల్సిన పింక్ కలర్ అయిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది. వేద ఎలాగైనా ఒడిపోయేలా చేయాలని మాళవిక ప్లాన్ వేస్తుంది. వేద గెలిస్తే నేను ఒడిపోయినట్టే తనని జీవితాంతం ఓడించి తీరాలి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఖుషి ఇంటికి వెళ్ళి రంగులు తీసుకొస్తానని అంటుంది. ఖుషి చేతిలోని రంగు డబ్బా వేద ముగ్గు మీద పడేలా చేస్తే వేద ఒడిపోతుందని అనుకుంటుంది. ఖుషి కలర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటే మాళవిక కాలు అడ్డం పెడుతుంది. వేద పరుగున వచ్చి ఖుషిని సమయానికి పట్టుకుని కిందపడిపోకుండా ఆపుతుంది. భయపడిపోయిన ఖుషి చాలా ఏడుస్తుంది. మాళవికని గమనించిన సులోచన తనని తిడుతుంది.


ఖుషిని ఎందుకు పడేశావ్ అని అరుస్తుంది. పరిగెడుతున్న ఖుషికి నువ్వు కాలు అడ్డం పెట్టి పడేయబోయావు నేను చూశాను అని సులోచన అంటుంది. చిన్నపిల్ల పట్ల ఇంత దారుణంగా ఎందుకు చేశావ్ నీ కూతురు లాంటిది కదా అని భ్రమరాంబిక అంటుంది.


మాళవిక: ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్ ఏంటి నా కూతురు గురించి నువ్వు చెప్తున్నావ్


Also Read: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు


సులోచన: కూతురు అని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఉండాలసిన ఖుషి నా కూతురు దగ్గర ఉండదు. తల్లిగా నీ ప్రేమ పెంపకం సరిగా ఉంటే నీ దగ్గర ఉండాల్సిన నీ కొడుకు నేరం చేసి బాలనేరస్థుల జైల్లో ఉండడు


ఏం కూశావ్ అంటూ  సులోచన మీద మాళవిక చెయ్యి ఎత్తితే వేద అడ్డుపడి తిరిగి తననే కొడుతుంది.


వేద: ఎంత ధైర్యం నీకు మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతావ్ అమ్మ అడిగిన దాంట్లో తప్పు ఏంటి. సమయానికి నేను వచ్చి పట్టుకున్నా కాబట్టి సరిపోయింది లేదంటే నా బిడ్డకి ఏమయ్యేది, నా ఖుషి జోలికి రావొద్దు


మాళవిక: ఖుషి నా కడుపున పుట్టిన నా కూతురు


మాలిని: నోర్ముయ్ నువ్వు కన్నతల్లివా, బరి తెగించి రోడ్డున పడినప్పుడు గుర్తుకు రాలేదా


మాళవిక: ఏంటి మీ గొప్ప, మీరు నన్ను వద్దనుకున్నారా, నేనే మిమ్మల్ని వద్దని అనుకున్నా వెళ్లిపోయా


భ్రమరాంబిక: తప్పు మాళవిక, చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్. సారీ.. మాళవిక తరఫున నేను క్షమాపణలు చెప్తున్న


మాళవిక: భ్రమరాంబిక మీద అరుస్తుంది. నోర్ముయ్.. తప్పుడు పని చేశావ్ నువ్వు, ఎవరు నువ్వు ఇదంతా నువ్వే చేశావ్. కావాలని ఇక్కడికి తీసుకొచ్చావ్ అడుగడుగునా అవమానించేలా చేశావ్. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావ్. మీ అంతు తేలుస్తా


వేద: అన్నీ వదులుకుంది నువ్వు దిగజారిపోయావ్. పాతాళానికి పడిపోయావ్ జీవశ్చవం నువ్వు గెట్ లాస్ట్


Also Read: దివ్యకి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన తులసి ఫ్యామిలీ- ఆస్తి కావాలని అడిగిన నందు


ఖైలాష్ కంగారుగా అభిమన్యు దగ్గరకి వచ్చి రెండు ఆత్మహత్యలు జరగబోతున్నాయ్ అని అంటాడు. భ్రమరాంబిక అక్క స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకురా కొద్దిగా వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నటిస్తా నా సూసైడ్ కి కారణం మాళవిక అని కంప్లైంట్ ఇవ్వమని భ్రమరాంబిక చెప్తుంది. అటు మాళవిక కూడా ఖైలాష్ ని పిలిచి పెట్రోల్ తీసుకుని రా పోసుకుని అంటించుకునేలోపు నువ్వు వచ్చి ఆపు భ్రమరాంబిక మీద కేసు పెట్టు నువ్వే సాక్ష్యం చెప్పాలని అంటుంది. నువ్వు ఉంటేనే కదా ఇదంతా జరిగేది పద పార్టీకి వెళ్దాంఅని అంటాడు. ముగ్గుల పోటీలో వేద గెలిచినట్టు భ్రమరాంబిక ప్రకటిస్తుంది.


ఈ పోటీలో పాల్గొనాలని అనుకోవడానికి అసలు కారణం నా బెస్ట్ ఫ్రెండ్ విన్నీ అని వేద చెప్పేసరికి యష్ చాలా బాధపడతాడు. విన్నీ గురించి చెప్పేసరికి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఖుషి గురించి చెప్పి ఎమోషనల్ అవుతుంది.