తులసి రికమండేషన్ వల్లే తనకి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న నందు ఇంటికి వచ్చి తన మీద అరుస్తాడు. పండగపూట జరిగిన గొడవ తలుచుకుని ఇంట్లో అందరూ చాలా బాధపడతారు. జాబ్ వచ్చేలా చేసి జీవితాంతం తన బానిసలా మార్చుకోవాలని చూసిందని నందు అన్న మాటలు తలుచుకుని తులసి ఫీల్ అవుతుంది. అటు నందు కూడా తులసి రికమండ్ చేసిందని గుర్తు చేసుకుని రగలిపోతాడు. అందరూ బాధగా ఉంటే తులసి మాత్రం బాధని దిగమింగుకుంటూ శ్రుతికి జాగ్రత్తలు చెప్తుంది. అందరూ ఎందుకు అంత దిగాలుగా ఉన్నారు, మాటలు అన్నది నన్ను కదా అని తులసి అంటుంది. ఎదురుతిరిగితే ఆయన రెచ్చిపోతారు అందుకే మౌనంగా ఉన్నానని అంటుంది. అయితే రాజీ పడతావా అని అనసూయ అంటుంది. అయితే ఇల్లు వదిలి వెళ్లిపోదామా అని తులసి అంటుంది.


Also Read: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర


నందు మాజీ భార్యగా ఆలోచిస్తే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తాను కానీ ఈ ఇంటి సంతోషం కోసం వాళ్ళని వెళ్ళమని చెప్పలేను అని సర్ది చెప్తుంది. దివ్య పై చదువుల కోసం ఢిల్లీ వెళ్తుంది అందరూ ఇలా ఉంటే తను బాధపడుతుందని అందరినీ మామూలుగా ఉండమని చెప్తుంది. వాళ్ళ నాన్న పలకరించకపోతే ఊరికి వెళ్ళను అంటుందని తులసి నందుని పిలుచుకురావడానికి వెళ్తుంది. దివ్య డల్ గా ఉండటం చూసి ప్రేమ్ వాళ్ళు మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని దివ్య అంటుంది. తన కోసం తల్లి కష్టపడుతుందని దివ్య చెప్తుంది. కానీ నువ్వు వెళ్లకపోతే బాధపడేది అమ్మ అని ప్రేమ్ సర్ది చెప్తాడు. కాసేపు తన మూడ్ మార్చేందుకు ఆట పట్టిస్తారు.


సందు దొరికింది కదా అని లాస్య తులసి గురించి నందుకి ఎక్కించేందుకు చూస్తుంది. తులసిని తలుచుకుంటూనే అని కోపంగా అనబోతుంటే తులసి ఎంట్రీ ఇస్తుంది. దివ్య బయల్దేరబోతుంది మీకోసం వెయిట్ చేస్తుంది నామీద ఉన్న కోపం దాని మీద చూపించకండి, నవ్వుతూ సాగనంపుదాం అని తులసి అంటుంది. కానీ లాస్య మాత్రం నోటితో వాగేస్తుంది. తులసి ఉత్తమ ఇల్లాలు అవాలంటే ఇంట్లో గొడవలు జరిగితే సర్ది చెప్పి అందరినీ కలపాలి అది ఉత్తమ ఇల్లాలి లక్షణం అని చెప్పేసరికి నోరు మూసేస్తుంది. దివ్య ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. అందరి దగ్గరకి వెళ్ళి తనకున్న అనుబంధం వాళ్ళ చిలిపి అల్లరి గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.


Also Read: యష్, వేదని మెచ్చుకున్న భ్రమరాంబిక- విన్నీని అడ్డం పెట్టుకుని చిచ్చుపెడుతున్న మాళవిక


‘నాకొక మాట ఇస్తారా నాన్న. మామ్ మీద ఎప్పుడు అరవొద్దు, తనతో ఎప్పుడు గొడవ పడొద్దు. కనీసం ప్రయత్నిస్తాను అనైనా మాట ఇవ్వండి డాడ్ ప్రశాంతంగా వెళ్తాను’ అని దివ్య అంటుంది. సరే అంటాడు. ఊరు వెళ్తునందుకు తనకి వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి దివ్య ఎమోషనల్ అవుతుంది. ‘నేను ఎక్కడ ఉన్న నువ్వు ఇచ్చిన స్వేచ్చని మిస్ యూజ్ చేసుకొను, ఎక్కడ ఉన్నా మెసేజ్ పెడతాను, నువ్వు గీసిన గీత దాటను’ అని దివ్య తులసికి ధైర్యం చెప్తుంది.


తరువాయి భాగంలో..


కబ్జా అయిన ఆస్తి పరంధామయ్యకి తిరిగొస్తుంది. అది విని తులసి ఫ్యామిలీ సంతోషపడతారు. కలిసొచ్చిన ఆస్తి తనకి రాసి ఇవ్వమని నందు తండ్రిని అడుగుతాడు. కానీ పరంధామయ్య మాత్రం ఆస్తి మనవాళ్లు, మనవరాళ్ళకి రాస్తానని చెప్తాడు.