గుప్పెడంతమనసు జనవరి 28 ఎపిసోడ్ (Guppedanta Manasu January 28th Update)

వసుధార నిజం చెబుతుంటే వినేందుకు ఇంట్రెస్ట్ చూపించని రిషి..ఏమీ చెప్పొద్దంటాడు. అటు వసుధార కూడా మీకు మీరుగా నిజం తెలుసుకోండి సార్ నేను ఏమీ చెప్పను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రిషి రూమ్ లో కూర్చుని ఆలోచిస్తుంటే..దేవయాని వస్తుంది..రిషి మనసు మార్చేందుకు ఏవేవో చెబుతూ వసుధార గురించి తక్కువగా మాట్లాడుతుంది. రిషిని వేరే ఊరు వెళ్లిపోమని చెబుతుంది. కానీ రిషి మాత్రం అవేమీ పట్టించుకోడు..తనను ఎవరూ బాధపెట్టడం లేదని క్లారిటీ ఇచ్చి దేవయానిని పంపించేస్తాడు..

మరోవైపువసుధార ఇంటికి చేరుకుని రిషి అన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంటే..తండ్రి చక్రపాణి వచ్చి కాఫీ ఇస్తాడు. మీరేంటి నాన్న అని వసుధార అంటే.. నువ్వు నా అమ్మవి అమ్మకు సేవచేసుకోవడం తప్పులేదంటాడు. ఏదేదో అడుగుదాం అనుకుంటూ వద్దులే బాధపెట్టడం ఎందుకని ఆగిపోతాడు. ఏవోవే అడుగుదాం అనుకుంటున్నారా నాన్నా అని వసుధార అంటే.. నువ్వు ఏం చేసినా కరెక్ట్ గా చేస్తావని తెలుసు అంటాడు. రిషి సార్ తో చెప్పావా అని చక్రపాణి అడిగితే చెప్పనివ్వడం లేదంటుంది వసుధార..అన్నీ సర్దుకుంటాయిలే అమ్మా అని ధైర్యం చెబుతాడు..

జగతి-మహేంద్ర
జగతి-మహంద్ర -ధరణి ముగ్గురూ కలసి రిషి-వసుధార గురించి మాట్లాడుకుంటారు.  దేవయాని ఏదో ప్లాన్ చేస్తోందనే అనుమానం ముగ్గురికీ వస్తుంది. తను కోరుకున్నవన్నీ జరిగాయి వసుధార-రిషి ఇద్దరూ విడిపోయారు కదా ఇంకా ఏముంది చేయడానికి అనుకుంటారు. 
జగతి: వసు మరొకర్ని పెళ్లి చేసుకుని రిషి ముందు తిరుగుతుంటే ఆ బాధ వర్ణనాతీతం కదా మహేంద్ర 
మహేంద్ర:వసుధార మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది జగతీ గమనించావా 
జగతి: మనల్ని క్షమాపణ అడిగి ఏదో జరిగిందని సర్దిచెప్పి ఎప్పటిలా కలసి ఉండాలని అనుకుంటోందేమో
ధరణి: రిషి-వసుధార బంధం మొదలైనప్పటి నుంచీ వాళ్లు ఒకరికోసం మరొకరు పుట్టారనిపించేలా ఉన్నారు ఇప్పుడు విడిపోయారంటే నమ్మేలా లేదు
జగతి: కొన్ని నమ్మక తప్పదు..రిషిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి
అవును అంటారు ధరణి, మహేంద్ర కూడా..

Also Read: చుట్టూ కమ్మే రేయో,మాయో మొత్తం కరగాలి - వసుని మరింత గాయపర్చిన రిషి

మరోవైపు వసుధార తండ్రి ఇంట్లోంచి బయలుదేరి బయటకు వస్తాడు..అప్పుడ జగతిని, రిషిని అన్న మాటలు తల్చుకుని బాధపడతాడు..నేను పెద్ద తప్పుచేశాను వసుధారకి జీవితాన్నిచ్చి, చదువుచెప్పిన టీచరమ్మను, వాళ్ల ఆయన్ను అవమానించాను, మూర్ఖంగా ప్రవర్తించాను..ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి..రిషి సార్ లాంటి ఉత్తముడు నా కూతురికి భర్తగా రాబోతున్నాడు..వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనుకుంటాడు. అందర్నీ అడ్రస్ అడుగుతూ వాళ్లింటికి వెళతుండగా వసుధార కాల్ చేస్తుంది..చిన్న పనిమీద బయటకు వచ్చాను తొందరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పి రిషి సార్ ఇంటికి వెళుతున్నాను..వెళ్లి క్షణాపణ చెప్పివస్తానంటాడు. వసుధార వద్దని చెప్పినా వినకుండా కాల్ కట్ చేస్తాడు చక్రపాణి..

Also Read: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

మరోవైపు వసుధార తండ్రి ఇంట్లోంచి బయలుదేరి బయటకు వస్తాడు..అప్పుడ జగతిని, రిషిని అన్న మాటలు తల్చుకుని బాధపడతాడు..నేను పెద్ద తప్పుచేశాను వసుధారకి జీవితాన్నిచ్చి, చదువుచెప్పిన టీచరమ్మను, వాళ్ల ఆయన్ను అవమానించాను, మూర్ఖంగా ప్రవర్తించాను..ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి..రిషి సార్ లాంటి ఉత్తముడు నా కూతురికి భర్తగా రాబోతున్నాడు..వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనుకుంటాడు. అందర్నీ అడ్రస్ అడుగుతూ వాళ్లింటికి వెళతుండగా వసుధార కాల్ చేస్తుంది..చిన్న పనిమీద బయటకు వచ్చాను తొందరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పి రిషి సార్ ఇంటికి వెళుతున్నాను..వెళ్లి క్షణాపణ చెప్పివస్తానంటాడు. వసుధార వద్దని చెప్పినా వినకుండా కాల్ కట్ చేస్తాడు చక్రపాణి..

ఇంట్లోంచి బయటకు వచ్చిన  జగతి-మహేంద్ర ..చక్రపాణిని చూసి షాక్ అవుతారు.. ఎందుకొచ్చారు ఇక్కిడికి అని ఫైర్ అవుతాడు మహేంద్ర...చక్రపాణి ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా జగతి వినదు..
చక్రపాణి: కాదమ్మా, అప్పుడు కళ్లు నెత్తిమీదకెక్కి పాకులాడాను నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నా ఇప్పుడు నా కూతురు గొప్పగా ఉందంటే అందుకు కారణం మీరేనమ్మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను
జగతి: మీ ఫ్యామిలీ అంతా మాకిచ్చిన గొప్ప బహుమతిని ఎలా మర్చిపోతాను.. ఇంట్లోంచి పొమ్మంటున్నారు
చక్రపాణి: అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది..ఆరోజు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానంటే... 
జగతి: అది మాకు అనవసరం
చక్రపాణి: నిజం మీకు చెప్పాలి
జగతి: దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి..మీలా మాట్లాడలేం..మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాయి
ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార..నాన్నా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారు..
ఒకరి తర్వాత ఇంకొకరు రావాలని ముందుగానే అనుకున్నారేమో అని మహేంద్ర సెటైర్ వేస్తాడు..వసుధార గారు మీరు వెళ్లండి ప్లీజ్.. ఈ ఇంటికి రావాల్సిన అవసరం మీకులేదంటుంది.. చక్రపాణిని మాట్లాడే అవకాశం ఇవ్వరు..
జగతి: మనిషిని నిలువునా కోసినట్టు మాట్లాడి..ఇప్పుడు క్షమించమనడం చాలాగొప్ప ఆలోచన చక్రపాణిగారు..
ఇంతలో దేవయాని మాట వినిపించడంతో..జగతి వాళ్లని పంపించేందుకు ప్రయత్నిస్తుంది కానీ..ఇంతలోనే దేవయాని  రాక గమనించి జగతి వాళ్లని వెళ్లమని గట్టిగా చెబుతుంది.. వాళ్లు వెళ్లిపోతారు... ఏదో కంగారుగా ఉన్నారేంటని దేవయాని వాళ్లని అనుమానిస్తుంది...