గుప్పెడంతమనసు జనవరి 27 ఎపిసోడ్ (Guppedanta Manasu January 27th Update)


వసుధార ఎప్పటిలా జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రిషి మాత్రం ఫైర్ అవుతాడు. అస్సలు వినిపించుకోడు
రిషి: షటప్ వసుధార..ఎవరితోనో తాళి కట్టించుకుని ఆ ముచ్చట్లు నాకు చెబుతానంటే నేను వినను గాక వినను... అయినా చెప్పడానికి నీకు అర్హత కూడా లేదు
వసుధార: ఇక మీదన మీకు ఏమీ చెప్పను
రిషి:సంతోషం చాలా సంతోషం నువ్వు వెళ్లొచ్చు
వసుధార బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది
రిషి: నా తల్లి చేసిన గాయం కన్నా వెయ్యిరెట్లు ఎక్కువ గాయపర్చావ్ వసుధారా
వసు: గాయం నా మనసుకి కూడా అయింది సార్...
మొత్తానికి దేవయాని-రాజీవ్ పథకం పారినట్టే ఉంది..నిజం ఇప్పట్లో రిషికి తెలిసే అవకాశం లేదు.. 



గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కాలేజీ మేడం, రిషితో కలసి మినిస్టర్ ను కలిసిన వసుధార..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తుంది. ఇంకనాకు ఏమీ చెప్పక్కర్లేదు..ప్రొసీడ్ అయిపో అని అభినందించిన మినిస్టర్... వసుధార లాంటి తెలివైన అమ్మాయి దొరకడం మన అదృష్టం తనని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దని సలహా ఇస్తాడు. తనే నన్ను వదులుకుందని బాధపడతాడు రిషి. భూషణ్ ఫ్యామిలీ అంతా నీకు అండదండలు అని వసుకి చెబుతాడు...మీరంతా కలసి ఉంటే అద్భుతాలు చేయగలుగుతారంటూ ఆల్ ది బెస్ట్ చెబుతాడు. 


అక్కడి నుంచి బయలుదేరుతారు.. కాలేజీ మేడం మినిస్టర్ గారి మాటల గురించి ప్రస్తావించడంతో..రిషి ఇన్ డైరెక్ట్ గా ఎవ్వరి ప్రేమకు లొంగిపోవద్దంటూ వసుధారకి కౌంటర్ వేస్తాడు. ఇంతలో కాలేజీ మేడంకు వేరే కాల్ రావడంతో ఆమెను ఇంటి దగ్గర దించేస్తారు...ఆ తర్వాత వసుధార -రిషి కార్లో మిగులుతారు. ఇంతలో ఎదురుగా వచ్చి కారు ఆపుతాడు రాజీవ్. రిషి సార్ మీరు నాకు ముఖ్యం..కారు పోనివ్వండని వసుధార అంటుంది..కిందకు దిగమని రాజీవ్ అంటాడు.. రిషి మాత్రం కారు దిగుతాడు.
రాజీవ్: నా భార్యని నాతో పంపించండి
వసు: రోడ్డుమీద ఏంటి న్యూసెన్స్.. నేను ఎక్కడికీ రాను..రిషి సార్ తో వెళతాను
రాజీవ్: ఏంటి రిషి సార్..నా వైఫ్ నాతో రాను మీతో వస్తానంటోంది ఏంటి..ఇది న్యాయంగా ఉందా
వసు: వెళ్లమని చెబుతున్నాను కదా వెళ్లిపో..
రాజీవ్: ఇది ఏ భర్తకీ రాకూడని పరిస్థితి..మీరు మంచోళ్లు రిషి సార్..నా వసుకి మీరే చెప్పండి సార్.. నాతో రాను అనడం ఏంటి.. వసు మారిపోయింది, వాళ్ల నాన్న మారిపోయాడు..ఇలా అయితే నా పరిస్థితి ఏంటి సార్
వసు: నేను రానంటున్నా కదా వెళ్లు.. సార్ తనది నటన..అసలేం జరిగిందో వినండి సార్..
రాజీవ్: జరిగింది తర్వాత తీరిగ్గా చెబుతాను రా అంటూ చేయి పట్టుకుంటాడు..
రిషికి ఏం చేయాలో అర్థంకాక ఆగిపోతాడు...రాజీవ్ నుంచి తప్పించుకుని ఆటో ఎక్కి వెళ్లిపోతుంది వసు..రిషి కూడా వెళ్లిపోతాడు.. రాజీవ్ క్రూరంగా నవ్వుకుంటాడు..


Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం - వసు గురించి నిజం తెలుసుకున్న రిషి రాజీవ్ కి బుద్ధి చెబుతాడా!


నా కళ్లెదుటే అన్నీ జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నా అని దేవయాని ఆలోచిస్తుంటే..రాజీవ్ కాల్ చేసి  జరిగినదంతా చెబుతాడు. త్వరలోనే వాళ్లిద్దరూ విడిపోవడం తథ్యం అని హామీ ఇస్తాడు..కాల్ కట్ చేసి దేవయాని నవ్వడం చూసిన ధరణి.. ఎవరికైనా కీడు జరిగితేనే కదా ఈవిడ నవ్వుకుంటుందని అనుకుంటుంది..


మరోవైపు రిషి..మహేంద్రను కలుస్తాడు...గుండె మండిపోతోందంటూ తన మనసులో బాధను చెప్పుకుంటాడు. మీతో కలసి తాగితే మీరున్నారని ధైర్యం డాడ్ అంటూ తండ్రి మహేంద్రతో కలసి తాగుతాడు. రిషిని ఎందుకు మోసం చేశావని వసుధారని అడుగు ఆకాశమా అంటూ ఏడుస్తూ మాట్లాడతాడు.. నన్ను అందరూ వద్దనుకుంటున్నారెందుకు..నేను రిజెక్టెడ్ పీసునా .. ఈ మంటని ఎలా తట్టుకోవాలి డాడ్ అని ఏమోషన్ అవుతాడు. తాగేందుకు ట్రై చేసి తాగలేక ఆ గ్లాస్ విసిరికొడతాడు రిషి.. అది చూసి మహేంద్ర సంతోషించి నాకు తెలుసునాన్నా ఇలాంటి వాటికి లొంగవని అంటాడు. నా బాధల్ని ఈ మందు తీర్చలేదు అంటాడు.. వసుధార వెళ్లింది, పెళ్లి చేసుకుంది మళ్లీ ఎందుకు రావాలి..ఇదేం ఆనందం..పైగా నేను జెంటిల్మెన్ ని అంట అని మాట్లాడుతూనే ఉంటాడు..


అటు వసుధార తండ్రి చక్రపాణికి భోజనం పెడుతుంది. ఎప్పటిలా చక్రపాణి కూతుర్ని క్షమించమని అడుగుతాడు. రిషి గురించి గొప్పగా చెబుతుంటుంది..దేవుడు నీకు మంచివాడినే చూపించాడమ్మా అని తండ్రి అంటే..వసుధార సంతోషిస్తుంది.