సంక్రాంతి పండుగ వేడుకలు అలకనంద అపార్ట్మెంట్స్ లో ఘనంగా జరుగుతూ ఉంటాయి. వేద మలయాళీ ముద్దుగుమ్మలా రెడీ అయితే యష్ కూడా సులోచన వాళ్ళు పెట్టిన డ్రెస్ వేసుకుని రెడీ అయి వస్తాడు. ఖుషి వెళ్ళి డాడీ అందంగా ఉన్నారు అని దిష్టి తీస్తుంది. డాడీ మమ్మీ ముగ్గుల పోటీలో పేటీ చెయ్యను అని అంటుందని చెప్తుంది. పార్టీసిపెట్ చేయకపోతే పోనివ్ అంటాడు. పక్కనే ఉన్న విన్నీ నా కోసం పార్టీసిపెట్ చెయ్యవా అని అడుగుతాడు. నేను అడిగితేనే పోటీ చేయలేదు ఇంక నువ్వు అడిగితే ఎందుకు పోటీ చేస్తుందని యష్ అంటాడు. దీంతో విన్నీ కాలేజ్ లో కూడా ఒకసారి ఇలాగే పోటీకి వెళ్ళను అన్నావ్ అప్పుడు నీ గడ్డం పట్టుకుని బతిమలాడాను అనగానే అది చూసి యష్ కోపంతో రగిలిపోతాడు. సరే పోటీ చేస్తానని చెప్తుంది. అప్పుడే వసంత్ వచ్చి పలకరించే సరికి తనని అడ్డం పెట్టుకుని వేదని చెడామడా తిట్టేస్తాడు. అది విని భలే క్యూట్ గా జలస్ పడుతున్నాడని సంబరపడుతుంది.


Also Read: దివ్యకి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన తులసి ఫ్యామిలీ- ఆస్తి కావాలని అడిగిన నందు


మాళవికని ముగ్గుల పోటీలో కూడా చేయొచ్చు కదా అని భ్రమరాంబిక అడుగుతుంది. రావని అనేసరికి ముగ్గులు వేయడం ఆడదాన్ని నిన్నే చూస్తున్నా అని అంటుంది. ఇంకా నువ్వు ఏంటి అమెరికాలో ఉంటూ కూడా పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడుతున్నావ్ అని అంటుంది. అప్పుడే ఖుషి అక్కడ పడబోతుంటే భ్రమరాంబిక పట్టుకుంటుంది. మీ మమ్మీ ఎవరని అడుగుతుంది. వేదని చూపించి డాటర్ ఆఫ్ వేదస్విని అని చెప్పేసి తన దగ్గరకి పరుగులు పెట్టి వెళ్ళి హగ్ చేసుకుని ముచ్చటగా ఆడుకుంటుంది. తర్వాత మాళవికకి ఇన్ డైరెక్ట్ గా తిడుతుంది. ముగ్గుల పోటీలో సులోచన, మాలిని, వేద అందరూ పాల్గొంటారు. వేదకి విన్నీ ఆల్ ది బెస్ట్ చెప్తే మీరు చెప్పారా అని యష్ ని అడుగుతుంది. చెప్పను అనేసరికి వేద ఖుషిని పిలుస్తుంది. దీంతో యష్ మొహాన నవ్వు పులుముకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాడు.


ముగ్గుల పోటీలు మొదలవుతాయి. అందరూ ముగ్గులు వేస్తూ ఉంటే విన్నీ వేదని ఫోటోస్ తీయడం చూసి యష్ కి కోపం వస్తుంది. అది మాళవిక కూడా చూస్తుంది. విన్నీ ఓవరాక్షన్ చూసి యష్ తల పట్టుకుంటాడు. వేద మొహాన కలర్ అయితే విన్నీ తుడుస్తాడు. అదంతా మాళవిక చూస్తూనే ఉంటుంది. యష్ మాత్రం వాళ్ళ ఓవరాక్షన్ తట్టుకోలేక పక్కకి వెళ్లిపోతాడు. తన వెనుకే మాళవిక కూడా వెళ్తుంది. యష్ ని పలకరిస్తుంది. వేద, విన్నీ గురించి నీచంగా మాట్లాడుతుంది. అంతా విన్న తర్వాత యష్ తనని తిడతాడు. వేద మీద నీ కుళ్ళు అంతా వెళ్లగక్కావా, అడుగడుగునా వేదని ఆడి పోసుకుంటున్నావ్ ఏం అన్యాయం చేసింది, చెడిపోయింది నువ్వు, వేద అంటే నీతి, సంస్కారం అని మెచ్చుకుంటూ ఉంటాడు. వేద పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు పనికిరావు అని గడ్డి పెడతాడు.


Also Read: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర


వేద ముగ్గు వేస్తూ టైమ్ అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. వేద గెలిస్తే నేను జీవితాంతం ఒడిపోయినట్టే తను ఒడిపోవాలి ఎలా అని మాళవిక అనుకుంటుంది. పింక్ కలర్ కావాలని వేద టెన్షన్ పడుతుంది. 


తరువాయి భాగంలో.. 


ఖుషి పింక్ కలర్ తీసుకొని వస్తుంటే మాళవిక కాలు అడ్డం పెట్టి తను పడబోయేలా చేస్తుంది. వేద పరుగున వచ్చి తనని పట్టుకుని మాళవికని కొడుతుంది. నా బిడ్డకి ఏదైనా జరగరానిది జరిగితే నీ అంతు చూస్తానని అంటుంది. నీ బిడ్డ ఏంటి ఖుషిని కడుపున మోసి కన్నది నేను అని మాళవిక అనేసరికి భ్రమరాంబిక షాక్ అవుతుంది.