యష్ వేదకి ప్రేమగా అన్నం వడ్డిస్తాడు. తర్వాత ఇద్దరూ పడుకుని ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటారు. వేదకి థాంక్స్ చెప్తాడు. మాళవిక అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయడం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటే అభిమన్యు వస్తాడు. ఏమైంది బంగారం అని అడుగుతాడు. నన్ను చంపేయ్ నీకు పెళ్ళాం అవడం కోసం భర్తని, పిల్లలన్నీ అందరినీ వదిలేసి వచ్చాను నీకోసం నేను చావడానికి కూడా రెడీ అని ఎమోషనల్ అవుతుంది. చంపేస్తాను మన మధ్య ఎవరైనా వస్తే అని అభి అంటాడు. నీకు నేను దూరం అయితే చవడానికి అయిన సిద్ధమేనని అంటాడు. నీ చేతిని మాత్రం ఎప్పటికీ వదలనని మాట ఇస్తాడు.


Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్


యష్ యోగా చేసుకుంటూ ఉంటే వేద ఫోన్ మోగుతూనే ఉంటుంది. పొద్దున్నే ఎవరు ఆ బఫూన్ గాడు అయి ఉంటాడని తిట్టుకుంటాడు. అప్పుడే వేద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పార్టీ ఉంది రమ్మని ఇన్వైట్ చేస్తాడు, ఇద్దరం వస్తామని చెప్తుంది. వేద రమ్మని బతిమలాడుతుంది. కానీ యష్ మాత్రం నేను వెళ్ళనే వెళ్ళను అని అనుకుంటాడు. బిర్యానీ ఆర్డర్ చేశారని ఒక అబ్బాయి తీసుకొచ్చి సులోచనకి ఇవ్వబోతాడు. దీంతో ఛీ ఛీ అని వాడిని సులోచన కాసేపు తిడుతుంది. తర్వాత మాలిని వచ్చి సులోచనతో గొడవ పెట్టుకుంటుంది. అది చూసి సెలవు రోజు కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరా అని వాళ్ళ గొడవ ఆపేందుకు జుట్టు చిందరవందర చేసుకుని వాళ్ళ దగ్గరకి వస్తుంది.


నేను జడ వేస్తానంటే నేను వేస్తానని మళ్ళీ గొడవపడతారు. దీంతో ఖుషి ఇద్దరినీ చెరొక జడ వేయమంటుంది. ఇద్దరూ వారి వారి స్టైల్ లో వేసి ఏ జడ బాగుందని రత్నం, శర్మని అడుగుతారు. శర్మ మాలిని వేసిన్ జడ బాగుందని అంటే రత్నం సులోచన వేసిన జడ బాగుందని మెచ్చుకుంటారు. కాసేపు ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. తర్వాత యష్ ఏదో అర్జంట్ మీటింగ్ ఉందని హడావుడిగా రెడీ అవుతుంటే వేద వచ్చి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. రెండు డ్రెస్ లు తీసి నచ్చిన డ్రెస్ బాగోలేదని చెప్తుంది. దీంతో అదే డ్రెస్ వేసుకుంటానని యష్ అంటాడు. ఆ మాటకి వేద నవ్వుకుంటుంది. నాకు తెలుసు మీరు ఇలాగే అంటారని అందుకే రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చాను నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నారని అంటుంది. పైకి మాత్రం కోపంగా తనని బయటకి వెళ్ళమని చెప్తాడు. వేద వెళ్తు తూలి యష్ మీద పడిపోతుంది. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది.


Also Read: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్


‘ఏది ఏమైనా వేద టెస్ట్ బాగుంటుంది. కానీ బయటకి ఆ మాట అనకూడదు. బెట్టు చేయాలి. అసలు ఏంటి ఈ వేద తనని ఎలా అర్థం చేసుకోవాలి. నా గురించి కేర్ తీసుకుంటుంది. కానీ పైకి మాత్రం కేవలం ఖుషి కోసమే అంటుంది. మా ఇద్దరి మధ్య మాకే తెలియని సరిహద్దు ఎందుకు దానికి కారణం ఎవరు నేనా, ఆ పైవాడా? మా ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుందని’ అనుకుంటాడు.