Tollywoo actor Srikanth Iyengar Marriage with actress jyothi : సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఆడియెన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టికస్ట్ జ్యోతితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో శ్రీకాంత్ అయ్యంగార్‌కి జ్యోతి ముద్దు పెడుతున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ... "క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయానుకుంటున్నారా?" అనే క్యాప్షన్‌ పెట్టారు శ్రీకాంత్. దాంతో వైరల్ అయింది. శ్రీకాంత్ అయ్యంగార్‌ ఈ ఫోటోని ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ... దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి.. ఇద్దరికి గ్రీటింగ్స్ కూడా చెబుతున్నారు. ఇంకొందరు నెగిటివ్ కామెంట్లతో మండిపడిపోతున్నారు. మరికొందరు మనం కూడా పెళ్లికి వెళ్దాం అంటూ.. కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. 54 ఏళ్ల వయస్సులో శ్రీకాంత్ అయ్యంగార్‌ ఇలాంటి ఫోటోని పెట్టి... పెళ్లిపై క్యాప్షన్ పెట్టడంతో వీళ్లు పెళ్లి చేసుకుంటారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇలా లేటు వయస్సులో పెళ్లి చేసుకోవడం టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. ఇటీవల సినినటుడు నరేష్, పవిత్రల పెళ్లి... దీనికి పెద్ద ఉదాహరణ. 






శ్రీకాంత్ అయ్యంగార్ టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనే పాత్రలతో ఆయన మెప్పించారు. మర్డర్, దిశ ఎన్‌కౌంటర్, కరోనా వైరస్ వంటి చిత్రాలతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అంతేకాదు కొన్ని అంశాలపై ఆయన స్పందించే తీరు, ఇచ్చే స్టేట్‌మెంట్స్ ద్వారా కూడా సోషల్ మీడియాలో అందరికి ఆయన సుపరిచితుడైపోయాడు. ముఖ్యంగా ఆయన దేవుడిని నమ్మనని... నాస్తికుడని చెబుతూ... దేవుడిపై రకరకాలుగా స్పందించడంతో కూడా నెటిజన్లకు ఆయన బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆయన  'మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?' సెటైరికల్‌గా క్యాప్షన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఆయన పోట్టేల్ సినిమా ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జర్నలిస్టులు, రివ్యూయర్లను తిట్టారు. దీంతో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో  శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలా నిత్యం వార్తల్లో ఉండే శ్రీకాంత్ అయ్యంగార్ ఇప్పుడీ పోస్ట్ పెట్టడం వైరల్ అయింది. 


Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?


ఇక ప్రముఖ సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి కూడా టాలీవుడ్ ఆడియన్స్‌కి చాలా  దగ్గరయ్యారు. 'పెళ్లాం ఊరెళ్లితే', ఎవడి గోల వాడిదే జ్యోతి  ప్రేక్షకులు దగ్గరయ్యారు. తర్వాత అనేక సినిమాల్లో కూడా నటించారు. తెలుగు బిగ్‌ బాస్‌లో కంటెస్ట్‌గా వెళ్లి.. కొన్నాళ్ల పాటు అలరించారు. ఇప్పటికీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా జ్యోతి నటిస్తున్నారు.


Also Read'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?