Vishwak Sen's Mechanic Rocky Movie Review In Telugu: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది? హీరో హీరోయిన్లు ఎలా నటించారు? వినోదం ఎలా ఉంది? వంటివి చూస్తే... 


కథ (Mechanic Rocky Story): రాకీ... రాకేష్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ కుర్రాడు. లైఫ్ ఎంజాయ్ చేయడం తెలిసినోడు. ఫ్రెండ్ సిస్టర్, తన జూనియర్ ప్రియా (మీనాక్షి చౌదరి)తో ప్రేమ వ్యవహారం ఒకటి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీ మానేసి వారసత్వంగా తండ్రి రామకృష్ణ (నరేష్) నుంచి వచ్చిన ఆర్కే గ్యారేజ్ బాధ్యతలు చూసుకోవాలసి వస్తుంది. గ్యారేజ్ సైట్ మీద రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది.


గ్యారేజ్ కాపాడుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరుగుతాడు రాకీ. ఆ సమయంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయ (శ్రద్ధా శ్రీనాథ్)కు రాకీ సమస్య తెలిసి ఎటువంటి సాయం చేసింది? రాకీ జీవితంలోకి మళ్ళీ ప్రియా రావడం వల్ల ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? గ్యారేజ్ కాపాడుకున్నాడా? లేదా? అందుకు రాకీ ఇంకేం చేశాడు? అతని జీవితంలో గ్యారేజ్ మించిన సమస్యలు ఏమున్నాయి? చివరకు ఎలా సాల్వ్ చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Mechanic Rocky Review Telugu): స్క్రీన్ ప్లే, అందులో భాగంగా వచ్చే ట్విస్ట్ ఏదైనా సరే... ప్రేక్షకుల ఊహకు అందనంత వరకు షాక్ మూమెంట్ / వావ్ ఫ్యాక్టర్ ఇస్తాయి. ట్విస్ట్ రివీల్ కావడానికి ముందు ఊహిస్తే... స్క్రీన్ ముందు సినిమా చూసే ప్రేక్షకుడికి మజా ఉండదు. 'మెకానిక్ రాకీ'లో వావ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. ముందు ముందు జరిగేది తెలిసేలా ఉండటంతో మజా పోయింది.


'మెకానిక్ రాకీ' టీజర్, పాటలు, ట్రైలర్లు చూస్తే పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే... ఆ అంచనాలు తప్పు అని, అంతకు మించి అనేటటువంటి కథ సినిమాలో ఉంది. అది ప్లస్సే. కానీ, అసలు కథలోకి వెళ్లేటప్పుడు, ఒక్కో ట్విస్ట్ రివీల్ కావడానికి ముందు ఊహించేలా ఉండటం పెద్ద మైనస్. దానికి తోడు అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, కమర్షియల్ హంగులు కామన్ ఆడియన్ అటెన్షన్ డైవర్ట్ చేస్తాయి.


'మెకానిక్ రాకీ' ఫస్టాఫ్‌లో కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. పోనీ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసిందా అంటే అదీ లేదు. తండ్రితో తిట్లు తినే కొడుకు, కాలేజీలో ప్రేమ కథ - కామెడీ, ఆ విలన్ ట్రాక్... ఇప్పటికే వందల సినిమాల్లో చూసిన కథను కొత్త డైలాగులతో మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత గానీ అసలు కథలోకి వెళ్లలేదు. తండ్రి పాత్రను ముందుగా మనకు చూపించడంతో క్లైమ్యాక్సులో కిక్ మిస్ అవుతాం. కొంతలో కొంత శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ట్విస్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛేజ్ సీక్వెన్సులు బాగా తీశారు. కామెడీ కొన్ని సన్నివేశాల్లో బావుందంతే! సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్... కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి తప్ప నోటీస్ చేసేలా లేవు. పాటలు కథకు అడ్డు తగిలాయి. కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి కథ తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను గుర్తు చేసేలా ఉంది. 


విశ్వక్ సేన్ ఎప్పటిలా హుషారుగా నటించారు. ఫైటుల్లో అగ్రేషన్ చూపించారు. పంచ్ డైలాగ్స్ తనదైన శైలిలో చెప్పారు. కథలో మంచి కోర్ పాయింట్ ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ, అది కరెక్టుగా ఎగ్జిక్యూట్ అవుతుందా? స్క్రీన్ ప్లే బావుందా? లేదా? అనేది చూసుకోవడంలో సక్సెస్ కాలేదు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి పెయిర్ ఓకే. కానీ ఇద్దరి మధ్య లవ్ / ఎమోషనల్ ట్రాక్ అంతగా వర్కవుట్ కాలేదు. మీనాక్షి నటన ఓకే. ఇంటర్వెల్ వరకు శ్రద్ధా శ్రీనాథ్ ఒకలా ఉంటే, ఆ తర్వాత రివీల్ అయ్యే ట్విస్టుల వల్ల మరోలా ఉంటుంది. యాక్టింగ్ ఓకే కానీ ఆ మేకోవర్ (ముఖ్యంగా బేబీ హెయిర్ కట్ విగ్, మేకప్) ఆమెకు సెట్ కాలేదు.


Also Read: మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?


నరేష్, హర్ష చెముడు, హర్షవర్ధన్, 'హైపర్' ఆది కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. '35 చిన్న కథ కాదు' ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ కీలకమైన క్యారెక్టర్ చేశారు. రోడీస్ రఘు రోల్ రెగ్యులర్‌గా ఉంది. సునీల్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో న్యాయం చేశారు. మిగతా నటీనటులు గుర్తుంచుకునే క్యారెక్టర్లు చేయలేదు.


'మెకానిక్ రాకీ'లో విషయం ఉంది. సామాన్యులు చాలా మంది ఘరానా కేటుగాళ్ల చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది చెప్పారు. అయితే... అసలు కథ వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. అప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. టూమచ్ రొటీన్ ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్ బెటర్. ఇంటర్వెల్ తర్వాత కూడా ట్విస్టులను మరింత బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. కామెడీ కొంత వర్కవుట్ కావడం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఊరట. ఫైనల్‌గా డిజప్పాయింట్ చేసింది దాసు!


Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే