దసరా సందర్భంగా టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర: పార్ట్ 1’ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కొడుకు జైలుకు వెళ్లాడన్న బెంగతో గుండెపోటు రావడంతో జానీ మాస్టర్ తల్లి ఆస్పత్రిలో చేరారు. తమిళ నటి ఒవియా ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.


అప్డేట్స్ జాతర @ టాలీవుడ్
జాతర... అప్డేట్స్ జాతర... ఒకట్రెండు కాదు, పదికి పైగా సినిమాల అప్డేట్స్ ఒక్కరోజు వచ్చాయి. తెలుగు సినిమాలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొత్త కబుర్లు వచ్చాయి. విజయ దశమి సందర్భంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాల అప్డేట్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైన అప్డేట్స్ ఏవి? ఎవరెవరు ఏయే కబుర్లు చెప్పారు? అనేది ఒక్కసారి చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దేవర @ 500 కోట్లు
పంచ వ్యాప్తంగా 'దేవర పార్ట్ వన్' కలెక్షన్లు 500 కోట్ల గ్రాస్ మార్కును దాటాయి. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెట్టేది. ఈ సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలతో పోలిస్తే అంత కలెక్ట్ చేసిందని ఊహించారు.‌ ఎన్టీఆర్ స్టార్ పవర్, జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులలో ఆయనకు ఉన్న ఇమేజ్ వంటివి పరిగణలోకి తీసుకుంటే 500 కోట్ల రూపాయల వసూళ్లు రావడం సహజమే. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి... సినిమా విడుదలైన రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలతో పాటు కొంత మంది ప్రేక్షకులు కూడా ఊహించలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)



తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్
తమిళ ఇండస్టీలో మరోమారు Leaked Video దుమారం రేగుతోంది. ప్రముఖ నటి, తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్ ఒవియాను పోలి ఉన్న ఓ వీడియో శనివారం ట్విటర్‌లో ప్రత్యక్షమైంది. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఒవియా మాదిరిగానే భుజంపైన టాటూ ఉండటంతో.. ఆ వీడియో తనదిగానే భావించి ప్రచారం చేస్తున్నారు. ఆమె మరో వ్యక్తితో కలిసి అభ్యంతరకర రీతిలో ఉన్న 17 సెకండ్ల క్లిప్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుని (నారా రామ్మూర్తి నాయుడు) కుమారుడు, యువ కథానాయకుడు నారా రోహిత్ నిశ్చితార్థం నేడు జరిగింది.‌ ఈ రోజు హైదరాబాద్ హైటెక్స్ సమీపంలోని నోవాటల్ హోటల్లో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఆస్పత్రిలో జానీ మాస్టర్ తల్లి...
ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ ఇంట్లో పరిస్థితులు అసలు ఏం బాలేదు. వాళ్లకు బ్యాక్ టైం నడుస్తున్నట్లు ఉంది. ఆల్రెడీ ఆయన జైలుకు వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగానికి లోను అవుతున్నారు. ఇప్పుడు మరొక బ్యాడ్ న్యూస్ వాళ్లకు రావడంతో ఏం చేయాలో పాలు పోనీ స్థితిలో ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)