Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి

Nara Rohit Siri Lella Engagement: నారా రోహిత్, 'ప్రతినిధి 2' సినిమాలో ఆయనతో నటించిన సిరి లేళ్ల నిశ్చితార్థం నేడు జరిగింది. కాబోయే కొత్త జంట ఫోటో చూడండి.

Continues below advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) సోదరుని (నారా రామ్మూర్తి నాయుడు) కుమారుడు, యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit) నిశ్చితార్థం నేడు జరిగింది.‌ ఈ రోజు హైదరాబాద్ హైటెక్స్ సమీపంలోని నోవాటల్ హోటల్లో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. 

Continues below advertisement

కాబోయే కొత్తజంట ఫోటో చూశారా?
రోహిత్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
నారా రోహిత్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు సిరి లేళ్ల (Siri Lella). ఆమె కథానాయిక. రోహిత్ నటించిన తాజా సినిమా 'ప్రతినిధి 2'లో సిరి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లికి ఈ జంట రెడీ అయింది. ఈ రోజు నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ - వసుంధరా దేవి... నారా లోకేష్ - బ్రాహ్మణి దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబాలు అందరూ ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.

Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

ప్రస్తుతం రోహిత్ ఏం చేస్తున్నారు? సినిమాల సంగతి ఏంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఏపీలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ వారసుడు నారా రోహిత్. అయితే... రాజకీయాల్లోకి ఆయన వెళ్ళలేదు. తనకు ఇష్టమైన నటన వైపు అడుగులు వేశారు. తొలి సినిమా 'బాణం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోహిత్. అదొక్కటే కాదు... ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Also Read: మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??

యువ హీరోల్లో నారా రోహిత్ శైలి చాలా భిన్నమైనది. కంటెంట్ బేస్డ్ సినిమాలు, అదే సమయంలో కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య కొంత విరామం తీసుకున్నప్పటికీ...'ప్రతినిధి 2'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ హీరో ప్రస్తుతం 'సుందరకాండ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 'ప్రతినిధి 2'కు విమర్శకుల నుంచి మంచి పేరు వచ్చింది. అయితే... రాజకీయ పరమైన కారణాల వల్ల ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు నారా రోహిత్ నుంచి రాబోయేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కావడం వల్ల మంచి నెగిటివిటీ తగ్గే అవకాశం ఉంది.

Continues below advertisement