Baba Siddique Death News: ముంబైలో ఓ రాజకీయ నాయకుడి హత్య జరిగితే... పొలిటీషియన్స్ కంటే ఫిలిం సెలబ్రిటీలు ఎక్కువ మంది కనిపించారు. రాజకీయ నాయకులు, సినిమా తారల మధ్య సంబంధాలు అంతంతే! రాజకీయాల్లోకి సినిమా తారలు వెళితే...‌ చిత్రసీమ అంతా మద్దతు ఇస్తుందని అనుకోవడం అత్యాశే! ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని సెలబ్రిటీలు ఆలోచిస్తారు.‌ ఎవరి బాబా సిద్ధిఖీ? 


బిగ్ బాస్ షూటింగ్ క్యాన్సిల్ చేసిన సల్మాన్ ఖాన్!
ముంబై మహానగరంలో శనివారం రాత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయం తెలియగానే... బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తన షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు.‌ కాల్పులకు గురైన తర్వాత బాబాను లీలావతి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సల్మాన్ అక్కడికి వెళ్లారు. బాబా కుటుంబ సభ్యులను ఓదార్చారు. 






సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు... హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా, సంజయ్ దత్ సహా పలువురు తారలు లీలావతి ఆసుపత్రి దగ్గర కనిపించారు. రాజకీయ నాయకులు సైతం ఉన్నారు.‌ 






ఎవరి బాబా సిద్ధిఖీ? ఆయన ఏం చేశారు?
Who Is Baba Siddique: బాబా సిద్ధికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు.‌ అయితే... పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, సినిమా తారలు అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ మంత్రిగా బాబా సిద్ధిఖీ పని చేశారు. ఆయన కుమారుడు జేషన్ సిద్ధిఖీ ప్రస్తుతం బాంద్రా ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే. తనయుడి ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో బాబా మీద దుండగులు అటాక్ చేశారు. ఆ తర్వాత ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సెప్టెంబర్ నెలలో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని 'వై' కేటగిరీ భద్రత కల్పించారు.


సిద్ధిఖీ వయసు 66 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, లేబర్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిట్రేషన్ శాఖల్లో ఆయన విధులు నిర్వర్తించారు. బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. బాబా సిద్ధిఖీ కుమార్తె ఆర్షియా డాక్టర్. కుమారుడు ప్రస్తుత బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే. ఆయన భార్య పేరు షెహజీన్. 


లావిష్ ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడంలో బాబా సిద్ధిఖీ ఫేమస్. ప్రతి ఏడాది ఆయన ఇచ్చే ఇఫ్తార్ పార్టీలకు బాలీవుడ్ టాప్ స్టార్స్, ఇంకా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరు అవుతారు. ఆయనకు సినీ తారలతో సత్సంబంధాలు ఉన్నాయి.


Also Read: బాలీవుడ్‌లో కలకలం రేపిన రాజకీయ నాయకుడి హత్య... సల్మాన్ - షారుఖ్ గొడవకు బాబా సిద్ధిఖీ ఎలా ఫుల్ స్టాప్ పెట్టారో తెలుసా?



బాబా సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ పార్టీలకు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది వస్తారు. షారుఖ్, సల్మాన్ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడింది కూడా బాబా ఇఫ్తార్ పార్టీలోనే. ఆయన మరణ వార్తతో హిందీ సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సెలబ్రిటీలు తమ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య