ముంబై మహానగరం శనివారం రాత్రి ఉలిక్కిపడింది.‌ మహారాష్ట్ర మాజీ‌ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్యతో ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కిరాయి హంతకులు కాల్చిన తుపాకీ తూటాలకు ఆయన ప్రాణం బలి అయింది. సినిమా సెలబ్రిటీలకు, హిందీ సినిమాలు ఫాలో అయ్యే ప్రేక్షకులకు బాబా సిద్ధిఖీ సుపరిచితులు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది ఆయనే అని తెలుసా? 


ఎవరి బాబా సిద్ధిఖీ?
ఎందుకు ఇంత పాపులారిటీ?
బాబా సిద్ధిఖీ... రాజకీయ నాయకుడు అయినా ఆయనకు సినిమా ప్రేక్షకులలో ఎందుకు అంత పాపులారిటీ? బాలీవుడ్ ఆడియన్స్ అందరికీ ఆయన ఎందుకు తెలుసు? అంటే... ప్రతి ఏడాది రంజాన్ పర్వదినాలలో బాలీవుడ్ స్టార్స్ అందరినీ ఒక్కచోటకు చేర్చగల శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు బాబా సిద్ధిఖీ. 


బాబా సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ పార్టీలకు హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు, అందాల భామలు తారలు అందరూ హాజరు అవుతారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో, మీడియాలో బాగా వైరల్ అవుతాయి. అందుకే ఆయన అంత పాపులర్. 


షారుఖ్, సల్మాన్ మధ్య గొడవకు ఎండ్ కార్డ్!
బాలీవుడ్ బడా స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మధ్య కోల్డ్ వార్ గురించి హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా 2008లో జరిగిన పార్టీలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటల యుద్ధం నుంచి చివరకు ఒకరినొకరు చేయి చేసుకునే వరకు వెళ్ళింది. అప్పటి నుంచి దూరం పెరగడం మాత్రమే కాదు... ఖాన్ హీరోలు ఇద్దరు ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్నారు. వాళ్ళిద్దరిని ఐదేళ్ల తర్వాత ఒకటి చేసినది బాబా సిద్ధిఖీ.


బాబా సిద్ధిఖీ 2018లో ఇచ్చిన ఒక ఇఫ్తార్ పార్టీకి సల్మాన్, షారుఖ్ హాజరు అయ్యారు. ఏప్రిల్ 17, 2013లో సిద్ధికి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసే ప్లాన్ వేశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన షారుఖ్ ఖాన్ ను తీసుకు వచ్చి సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ పక్కన కూర్చోబెట్టారు. అప్పుడు సల్మాన్, షారుఖ్ ఎదురెదురుగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఒకరినొకరు హాగ్ చేసుకుని విష్ చేసుకున్నారు. ఆ మూమెంట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడింది.


Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?



'షారుఖ్, సల్మాన్ మధ్య మీరు మీడియేటర్ గా వ్యవహరించారట కదా? వాళ్ళిద్దరిని ఒకటి చేశారట కదా?' అని మీడియా అడగ్గా... ''వాళ్ళిద్దరు ఒకటి కావాలని అనుకున్నారు. అల్లా ఒక దారి చూపించాడు. అందులో నేను చేసిందేమీ లేదు'' అని బాబా సిద్ధిఖీ చెప్పారు.


బాలీవుడ్ బడా బడా స్టార్స్ ఎందరికో ఎంతో ఆప్తుడు, ఇష్టమైన రాజకీయ నాయకుడు అయిన బాబా సిద్ధిఖీ మరణంతో హిందీ సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శిల్పా శెట్టి, సంజయ్ దత్ సహా పలువురు బాలీవుడ్ తారలు అందరూ ప్రతి ఏడాది బాబా సిద్ధిఖీ ఇచ్చే పార్టీకి అటెండ్ అవుతారు.


Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య