మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses) స్టార్ పవర్ ఎంత? అంటే సోషల్ మీడియా ట్రోల్స్, మిక్స్డ్ టాక్ వంటివి తట్టుకుని మరీ సినిమాను లాభాల్లోకి తీసుకు వచ్చేంత! అందుకు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్... 'దేవర: పార్ట్ 1' (Devara Part 1).
రూ. 500 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ 'దేవర'
Devara Part 1 enters into Rs 500 Crore club: ప్రపంచ వ్యాప్తంగా 'దేవర పార్ట్ వన్' కలెక్షన్లు 500 కోట్ల గ్రాస్ మార్కును దాటాయి. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెట్టేది. ఈ సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలతో పోలిస్తే అంత కలెక్ట్ చేసిందని ఊహించారు.
ఎన్టీఆర్ స్టార్ పవర్, జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులలో ఆయనకు ఉన్న ఇమేజ్ వంటివి పరిగణలోకి తీసుకుంటే 500 కోట్ల రూపాయల వసూళ్లు రావడం సహజమే. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి... సినిమా విడుదలైన రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలతో పాటు కొంత మంది ప్రేక్షకులు కూడా ఊహించలేదు.
'దేవర' విడుదలైన రోజు మిక్స్డ్ టాక్ లభించింది. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఫాన్స్ విపరీతమైన ట్రోలింగ్ చేయించారు. అయినా సరే ఈ సినిమా తట్టుకుని నిలబడింది. విజయ దశమి వరకు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. ఇంకా 'దేవర'ను చూడాలని థియేటర్లకు వస్తున్న జనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క పేరు ఎన్టీఆర్. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నది ఆయన చరిష్మా, స్టార్ స్టేటస్.
Also Read: అప్డేట్స్ జాతర @ టాలీవుడ్ - దసరాకు ఎవరెవరు ఏయే కొత్త విషయాలు చెప్పారో తెలుసా?
పంపిణీదారులకు భరోసా ఇచ్చిన ఎన్టీఆర్!
'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్', 'కేజిఎఫ్ 2', 'కల్కి 2898 ఏడీ' వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి అంటే... కారణాలు వేరు. పార్ట్ వన్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 మీద అంచనాలు పెరగడం భారీ ఓపెనింగ్ సాధించడం సహజం. రాజమౌళి బ్రాండ్ వాల్యూ మీద 'ట్రిపుల్ ఆర్' ఆడిందని చెప్పే జనాలు ఉన్నారు. 'దేవర'కు వస్తే పూర్తిగా ఇది ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఆడిన సినిమా. దీనికి ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' ఆశించిన రీతిలో ఆడలేదు. వసూళ్లు సైతం రాలేదు. 'దేవర' విడుదల తర్వాత 100% హిట్ టాక్ కూడా లేదు. అయినా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. దాంతో పంపిణీదారులకు ఎన్టీఆర్ అంటే భరోసా ఏర్పడింది. ఇక నుంచి దర్శకుడు తీసిన గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరు కనపడితే కోట్ల రూపాయలు పెట్టి రైట్స్ కొనే భరోసా కలిగింది. దేవర తర్వాత వార్ డ్రాగన్ సినిమాలతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. దేవర 2 విడుదల సమయానికి ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కావడం కూడా ఖాయమని చెప్పాలి.