రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో సాంగ్స్‌కు భారీ బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మడయ్యాయి. ‘పుష్ప 2’ సినిమాకు ఏపీ, తెలంగాణల్లో రూ.190 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. సూర్య 44 సినిమా మీద దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. జీ5లో ‘అయిందాం వేదం’ అనే ఫాంటసీ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది.


'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా
‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ ఆయన ఫ్యాన్స్ ను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘భారతీయుడు 2’తో పాటు ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టినా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లేట్ గా వచ్చినా లేటెస్టుగా వస్తుందంటున్నారు చెర్రీ అభిమానులు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ సాంగ్స్ విషయంలోనూ శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్ కోసం ఏకంగా రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారా అద్వానీ, రామ్ చరణ్ పైన పాటను చిత్రీకరించారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఐదో వేదం చుట్టూ తిరిగే మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్...
దర్శకుడు నాగరాజన్ తెరకెక్కిస్తున్న తాజా థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఐంధమ్ వేదమ్’ (ఐదో వేదం). త్వరలో ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తమిళ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అయ్యింది. ‘మర్మదేశం’ దర్శకుడు తెరకెక్కించడం, విజయ్ సేతుపతి ట్రైలర్ ను విడుదల చేయడంతో వెబ్ సిరీస్ పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. తాజా ట్రైలర్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పుష్ప 2 @ 190 కోట్లు...
'పుష్ప 2' సినిమా (Pushpa 2 Movie) ఈ ఇయర్ ఎండ్ ధమాకాగా థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందా? లేదా? అనే డౌట్లకు చెక్ పెడుతూ... రిలీజ్ డేట్ (డిసెంబర్ 6)తో కూడిన పోస్టర్ రీసెంట్‌గా ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా మీద క్రేజ్ ఓ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కూడా ఆ స్థాయిలో అమ్మారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)



సూర్య కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ
తమిళ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బడా ఓటీటీ సంస్థ చేతిలో 'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రసీమతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఇది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటిటి డిజిటల్ డీల్ గురించిన సమాచారం వెల్లడైంది. మరి ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఏ ఓటిటి దక్కించుకుంది? దాని కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)