Watch Aindham Vedham Web Series Trailer: దర్శకుడు నాగరాజన్ తెరకెక్కిస్తున్న తాజా థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఐంధమ్ వేదమ్’ (ఐదో వేదం). త్వరలో ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తమిళ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అయ్యింది. ‘మర్మదేశం’ దర్శకుడు తెరకెక్కించడం, విజయ్ సేతుపతి ట్రైలర్ ను విడుదల చేయడంతో వెబ్ సిరీస్ పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. తాజా ట్రైలర్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 


ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్న ట్రైలర్


టైటిల్ పోస్టర్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ‘ఐంధమ్ వేదమ్’ సిరీస్, ఆ తర్వాత ఫస్ట్ లుక్ మరింత ఆకట్టుకుంది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. సుమారు రెండున్నర నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ ఓ ప్రాచీన గ్రంథం చుట్టూనే తిరుగుతుంది. వెబ్ సిరీస్ కథ ఏంటినేది స్పష్టంగా చెప్పకపోయినా, ఐదవ వేదంలోని రహస్యాలను ఛేదించే కథాశంతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ వెబ్ సిరీస్ ను చూడాలా? అనేలా ఉంది.


ఇంతకీ ఆ పెట్టెలో ఉన్నది ఏంటి?


ఈ వెబ్ సిరీస్ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన ఓ ప్రాచీన గ్రంథం చుట్టూనే కథ నడుస్తుంది. ఈ పుస్తకంలో రాసిన భాష ఎవరికీ అర్థం కాదు. ఈ గ్రంథంలోని భాష ఏంటని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను ఈ వెబ్ సరీస్ లో చూపించనున్నారు. ఈ వెబ్ సరీస్ లో ధన్సిక అను అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆమె చుట్టూనే తిరుగుతుంది. తన తల్లి అంత్యక్రియల కోసం వారణాసికి వెళ్తుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె చేతిలో ఓ బాక్స్ పెడతాడు. ఆ బాక్స్ ను తమిళనాడులోని ఓ పూజారికి ఇవ్వాలని చెప్తాడు.   దానిని తీసుకెళ్లి పూజారికి ఇచ్చే క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లను, ప్రమాదాలను ఆసక్తికరంగా తెరకెక్కించనున్నారు. ఇంతకీ బాక్సులో ఏం ఉంది? ఐదో వేదానికి ఉన్న లింకేంటి? అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు.   



అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్


‘ఐంధమ్ వేదమ్’  వెబ్ సిరీస్ అక్టోబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్ర, కృష్ణ కురుప్, రామ్‌ జీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నరు. అభిరామి మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ముందుకురానుంది. 


Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?