మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన కెరీర్‌లో మొదటిసారిగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రసీమతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఇది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటిటి డిజిటల్ డీల్ గురించిన సమాచారం వెల్లడైంది. మరి ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఏ ఓటిటి దక్కించుకుంది? దాని కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది? అనే వివరాల్లోకి వెళ్తే... 


బడా ఓటిటి చేతికి 'గేమ్ ఛేంజర్' రైట్స్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఆయన డ్యూయల్ రోల్ పోషించబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె రామ్ చరణ్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం ఇది రెండోసారి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లతో పాటు డిజిటల్, సాటిలైట్, థియేట్రికల్ రైట్స్ డీల్స్ ను కూడా క్లోజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం పలు బడా ఓటిటి సంస్థలు పోటీ పడగా, అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం ప్రకారం దాదాపు రూ. 170 కోట్లు చెల్లించి 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీతో పాటు ఇతర దక్షిణ భాషల 'గేమ్ ఛేంజర్' స్ట్రీమింగ్ రైట్స్ మొత్తానికి కలిపి ఇంత భారీ ధరను చెల్లించినట్టుగా తెలుస్తోంది. అలాగే 'గేమ్ ఛేంజర్' మూవీ రైట్స్ ను దక్కించుకున్నట్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.


Also Read: జైల్లో ఉన్న జానీ మాస్టర్‌కు మద్దతుగా ఆనీ... నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం, కేసు మీద షాకింగ్ కామెంట్స్



'గేమ్ ఛేంజర్' ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే... 
ఇక పనిలో పనిగా 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీని ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని కూడా వెల్లడించింది. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. 2025 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.


Read Also : Jai Hanuman: ‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?