Femina Miss India 2024: నికిత పోర్వాల్‌ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన అందాల పోటీలో నిఖిత కిరీటాన్ని దక్కించుకుంది. మరి ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె నటించిన ఒక్కగానొక్క ఒక సినిమా ఏది? అని విషయాన్ని తెలుసుకుందామా! 


200 మంది అమ్మాయిలను దాటుకుని.. 
ఫెమినా మిస్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే అక్టోబర్ 16 రాత్రి జరిగింది. ఇది 60వ భారతదేశపు అత్యంత ప్రసిద్ధ అందాల పోటీ. ఈ పోటీలో 30 రాష్ట్రాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీలు గత నెలలో ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు 200 మంది అమ్మాయిలు ఇందులో పాల్గొనగా, ఢిల్లీలో జరిగిన తొలి రౌండ్‌ టాప్ 5గా నిఖిత ఎంపికైంది. దీని తరువాత టాప్ 5 రెండవ రౌండ్ ముంబైలో జరిగింది, దీనిలో ఒక రాష్ట్రం నుండి ఒక పోటీదారుని ఎంపిక చేయవలసి ఉంది. అందులో కూడా ఆమె ఎంపికైంది. చివరగా ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకుంది. 


బుధవారం ముంబైలోని వర్లీలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీలో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న నికితా ఒక నటి. ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి నటిస్తోంది. కాగా ఈ పోటీలో దాదర్ నగర్ హవేలీకి చెందిన రేఖా పాండే ఫస్ట్ రన్నరప్‌గా, గుజరాత్‌కు చెందిన ఆయుషి ధోలాకియా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా కిరీటాన్ని నికితా తలపై ఉంచారు. నేహా ధూపియా ఆమెకు మిస్ ఇండియా సాష్ ఇచ్చింది. అలాగే ఈ ఈవెంట్‌లో నటి సంగీతా బిజ్లానీ ప్రదర్శనతో ర్యాంప్ వాక్ చేసింది. ఫెమినా మిస్ ఇండియా 2024 ఈవెంట్‌లో రాఘవ్ జుయల్, చాలా మంది ఇతర ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై కనిపించారు. ఇదిలా ఉంటే నికితా ఒక టెలివిజన్ యాంకర్‌, నటి కూడా. 


Read also : Hansika Mothwani : కొత్త ఇంటిని కొన్న హన్సిక.. భర్తతో కలిసి గృహ ప్రవేశం - పిక్స్ వైరల్ 


బ్యూటీ విత్ బ్రెయిన్స్.. నికితా నటించిన సినిమా ఇదే 
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కి చెందింది నికిత పోర్వాల్‌. ఇక ఈ అమ్మడు మంచి స్టోరీ టెల్లర్ కూడా. అందుకు తగ్గట్టుగానే ఇప్పటిదాకా సుమారు 60కి పైగా నాటకాలలో నటించి మెప్పించింది. అంతేకాదు 250 పేజీల 'కృష్ణ లీల' అనే నాటకాన్ని కూడా రాసింది. ఫెమినా మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ టీవీ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించింది. మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో అటువైపు అడుగులేసి, ఇప్పుడు మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచింది. నికిత పోర్వాల్‌ తండ్రి అశోక్ పోర్వాల్. ఆయన డ్రామాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఈ బ్యూటీ కార్నెల్ కాన్వెంట్ లో సెకండరీ స్కూల్, బరోడాలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో నుంచి డిగ్రీ పట్టా పొందింది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన 'చంబల్ పర్' సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితం అయ్యింది. త్వరలోనే ఇండియాలో రిలీజ్ కాబోతోంది.



Read Also : Radhika Apte: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే