రాధికా ఆప్టే (Radhika Apte) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్'తో పాటు 'లయన్' సినిమాలో ఆమె నటించింది. అంతకు ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'రక్త చరిత్ర'లో కనిపించింది. ఇప్పుడు ఆమె నిండు గర్భవతి. ఈ విషయం తెలిసి మన తెలుగు ప్రేక్షకులే కాదు... హిందీ సినిమా ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని జనాలకు ఎప్పుడు తెలిసిందంటే?
బేబీ బంప్‌తో కనిపించిన రాధికా ఆప్టే
బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024)కు రాధికా ఆప్టే అటెండ్ అయ్యింది. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన 'సిస్టర్ మిడ్ నైట్'. దాన్ని ఆ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఆ సినిమా స్క్రీనింగ్ కోసం బుధవారం రాధికా ఆప్టే వచ్చింది. ఆవిడను చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. బేబీ బంప్‌తో కనిపించిన రాధికా ఆప్టే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వాటిని ఆమె పోస్ట్ చేయడం విశేషం.
Radhika Apte Baby Bump Photos: 'సిస్టర్' స్క్రీనింగ్ ఫోటోలను రాధికా ఆప్టే షేర్ చేసే వరకు ఆవిడ ప్రెగ్నెంట్ అనే విషయం ప్రేక్షకులకే కాదు... హిందీ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. దాంతో షాక్ అయ్యారు. అదీ సంగతి!
Also Read: మహానటి... అసలైన పరీక్ష ముందుంది మరి - ఇయర్ ఎండ్ కీర్తి సురేష్‌కు చాలా ఇంపార్టెంట్, ఎందుకో తెలుసా?
రాధికా ఆప్టేకు ఎప్పుడు పెళ్లి అయ్యింది?
ఆడియన్స్ కొంత మందిలో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. రాధికా ఆప్టేకు ఎప్పుడు పెళ్లి అయ్యింది? ఆవిడ భర్త ఏం చేస్తారు? అని! ఎందుకు అంటే... రాధికా ఆప్టే పెళ్లి ఫోటోలు ఎప్పుడూ బయటకు రాలేదు. అసలు విషయం ఏమిటంటే... వివాహం అయిన తర్వాత కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పెళ్లైన తర్వాతే 'లెజెండ్', 'లయన్' వంటి సినిమాల్లో నటించారు.
రాధికా ఆప్టే భర్త పేరు బెనెడిక్ట్ టైలర్. ఆయన బ్రిటిష్ వ్యక్తి. మ్యూజిక్ కంపోజర్ అండ్ వయలనిస్ట్. రాధికా ఆప్టేతో బెనెడిక్ట్ వివాహం 2012లో జరిగింది. అయితే, అది లో ప్రొఫైల్ వెడ్డింగ్. ఆ మరుసటి ఏడాది 2013లో అఫీషియల్ వెడ్డింగ్ జరిగింది. రాధికా ఆప్టే నటించిన మూడు హిందీ సినిమాలు 'ఫోరెన్సిక్', 'విక్రమ్ వేద', 'మోనికా ఓ మై డార్లింగ్' 2013లో విడుదల అయ్యాయి. గత ఏడాది 'మిస్సెస్ అండర్ కవర్' సినిమా ఒక్కటే చేశారు. ఈ ఏడాది 'మేరీ క్రిస్మస్'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?