'పుష్ప 2' సినిమా (Pushpa 2 Movie) ఈ ఇయర్ ఎండ్ ధమాకాగా థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందా? లేదా? అనే డౌట్లకు చెక్ పెడుతూ... రిలీజ్ డేట్ (డిసెంబర్ 6)తో కూడిన పోస్టర్ రీసెంట్‌గా ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా మీద క్రేజ్ ఓ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కూడా ఆ స్థాయిలో అమ్మారు.
ఏపీలో 'పుష్ప 2' రైట్స్ రేటు విన్నారా?
తగ్గేదే లే... 'పుష్ప: ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. అస్సలు తగ్గేదే లే... 'పుష్ప: ది రూల్' కోసం ఆ డైలాగును ఇంకొంచెం మార్చి రాశారు. రైట్స్ పరంగా బిజినెస్ లెక్కల విషయంలో నిర్మాతలు సైతం అదే మాటను చెబుతున్నారని ఫిల్మ్ నగర్ ఇండస్ట్రీ టాక్.
ఏపీలో అన్ని ఏరియాల 'పుష్ప 2' రైట్స్ కలిపి 90 కోట్ల రూపాయల రేషియోలో ఇచ్చారని తెలిసింది. ఒక్క ఉత్తరాంధ్ర రైట్స్ మాత్రమే రూ. 23 కోట్లు అని టాక్. విశాఖ రైట్స్ సాయి కొర్రపాటి, కృష్ణా జిల్లా రైట్స్ 'బన్నీ' వాసు, గుంటూరు రైట్స్ యూవీ క్రియేషన్స్ వంశీ, వెస్ట్ గోదావరి రైట్స్ ఎల్‌విఆర్, నెల్లూరు రైట్స్ భాస్కర రెడ్డి, ఈస్ట్ గోదావరి రైట్స్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారని సమాచారం. విశాఖ ఏరియాలో 'అల వైకుంఠపురములో' 21 కోట్లు కలెక్ట్ చేసిందని, పాన్ ఇండియా హిట్స్ 'సలార్', 'కల్కి', 'దేవర' వంటివి ఏవీ అంత కలెక్ట్ చేయలేదని టాక్. మరి, 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
తెలంగాణ, రాయలసీమలో ఎంతకు అమ్మారో తెలుసా?
ఏపీలో రూ. 90 కోట్లకు రైట్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... తెలంగాణ రైట్స్ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. మైత్రికి స్వంత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ద్వారా విడుదల చేయడానికి రెడీ అయ్యింది. రాయలసీమ (సీడెడ్) రైట్స్ మాత్రం రూ. 30 కోట్లకు అభిషేక్ రెడ్డి కొన్నట్టు తెలిసింది. సో, ఏపీ అండ్ తెలంగాణలో 'పుష్ప 2' రైట్స్ రూ. 190 కోట్లు అన్నమాట.
Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
ముందు రోజు ప్రీమియర్ షోలు వేస్తారా? ప్లాన్ అంతా రెడీనా?
డిసెంబర్ 6న సినిమా విడుదల అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కానీ, ఓవర్సీస్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం... డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. విదేశాల్లో డిసెంబర్ 4న ప్రీమియర్స్ పడవచ్చు. బన్నీ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?