మనసులో ప్రేమని ఆయనకి చెప్పాలనుకుంటున్నా మా ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని దేవుడిని వేడుకుంటూ గుడిలో కాయిన్ నిలబెట్టడానికి చూస్తుంది కానీ కాయిన్ పెట్టగానే పడిపోవడంతో వేద బాధపడుతుంది. ఖుషి కోసమే ఆయన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాను కానీ ఇప్పుడు జీవితాంతం ఆయనతో ఉండాలని అనుకుంటున్నా, ఆయనతో హ్యపీగా ఉండాలని అనుకుంటున్నా అని మరోసారి మనసులో అనుకుని కాయిన్ నిలబెట్టేందుకు చూస్తుంది. విన్నీ అది చూసి ఆ కాయిన్ నిలబడదు నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత యష్ ఎగ్జిట్ అవడమేనని నవ్వుకుంటాడు. తులాభారం జరిగే దగ్గరకి వెళ్ళి పూజారిని ఏంటిది అని అడుగుతాడు. భర్తని తులాభారం చేస్తే ఆ ఇద్దరి బంధం జన్మజన్మల బంధం అవుతుందని పూజారి చెప్తాడు.


Also Read: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర


వేద, యష్ ని ఒక్కటి కానివ్వను వాళ్ళ మనసులు మాత్రమే కలవాలి అంతకమించి ముందుకు వెళ్లకూడదని అనుకుని విన్నీ బెల్లం కుందులు తీసుకుని వెళ్ళిపోతాడు. మాలిని, సులోచన రాగానే ఏమి తెలియనట్టు తులాభారం ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందని నటిస్తాడు. వేద కాయిన్ నిలబెడుతుంటే యష్ వెళ్ళి సాయం చేస్తాడు. అప్పుడు కాయిన్ నిలబడుతుంది అది చూసి వేద చాలా సంతోషపడుతుంది. ఇక నుంచి ఏ గొడవలు లేకుండా వేదతో హ్యపీగా లైఫ్ గడపాలని అనుకుంటున్నా దేవుడా అని యష్ మనసులో కోరుకుంటాడు. వేద సంతోషంగా కాయిన్ నిలబడిందని చిన్న పిల్లలా ఎగిరిగంతులేస్తుంది. విన్నీ వేద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కిందపడేస్తాడు. మీరు కోరుకున్నట్టు కలిసిపోవడానికి ఇంక నేనెందుకు వేళ మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడి దాకా రావడం ఎందుకు. వేదని నాతో తీసుకుని వెళ్తాను తనతో ఏడడుగులు నడిచి అమెరికా వెళ్లాలని కోరుకుంటూ కాయిన్ నిలబెట్టేందుకు చూస్తాడు కానీ విఫలమవుతాడు. అప్పుడే మట్టి తీసుకొచ్చి పోసి అందులో కాయిన్ నిలబెడతాడు.


Also Read: రాజ్, కావ్య ప్రేమకీచులాట స్టార్స్- పగబట్టిన రుద్రాణి, నిజం తెలుసుకున్న స్వప్న


మంచిగా చెప్తే వినాలి లేదంటే ఎంత దూరమైన వెళ్ళి బలవంతంగా అయినా లొంగదీసుకుంటానని అంటాడు. తులాభారం ఎందుకు వేస్తారని ఖుషి అడుగుతుంది. ఇద్దరి మనసులో ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు ఈ తులాభారం తూగుతుందని సులోచన చెప్తుంది. ఈ బంగారంతో మీ నాన్నని తూస్తారని చెప్తుండగా ఒకవేళ తూగకపోతే ఏం చేస్తారని విన్నీ అడిగేసరికి అలా అనకూడదని అంటారు. మనసుల మధ్య ప్రేమ ఉంటే తూగుతారని మాలిని చెప్తుంది. ఎంత ప్రేమ ఉన్నా కూడా బరువుకి తగిన బెల్లం లేకపోతే ఎలా తూగుతాడు ఆ బెల్లం నేను తీసేశానుగా అని అనుకుంటాడు. తులాభారం చేస్తే మనసులో కోరిక సత్వరమే నెరవేరుతుందని పూజారి చెప్తాడు. వేద దేవుడికి హారతి ఇచ్చి తులాభారం చేసేందుకు మొదలుపెడుతుంది. త్రాసుకి ఓ వైపు యష్ కూర్చోబెడుతుంది. పూజ చేసే వాళ్ళు ముందుగా దేవుడికి తులసి మాల వేయాలని చెప్పేసరికి దాన్ని తీసుకురావడానికి వేద వెళ్తుంది. విన్నీ ఎవరికి కనిపించకుండా వేద వెనుకే వెళతాడు. తులసి మాలకి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని పూజారి అంటాడు. వేద ఒక గదిలోకి వెళ్ళగానే విన్నీ వచ్చి దాన్ని లాక్ చేస్తాడు.