కనకం కూతురి దగ్గరకి ఇక రానని చెప్పి బాధగా వెళ్ళిపోతుంది. ఎంత ధైర్యం నా ఇంట్లో వాళ్ళ ముందే నన్ను ఇరికిస్తుందా అని రుద్రాణి మనసులో తిట్టుకుంటుంది. ఎంత ఓర్పు ఈ అమ్మాయికి ఇంతమంది కలిసి అవమానిస్తున్నా ఎంత ధైర్యంగా ఎదుర్కొంటుందని ధాన్యలక్ష్మి మెచ్చుకుంటుంది. పిల్లల్ని లోపలికి పంపించేస్తుంది అపర్ణ. రాజ్ కూడా వెళ్లిపోతుంటే ఆపుతుంది. రేఖ వెళ్లిపోకుండా చాటుగా వింటుంది.
అపర్ణ; ఎందుకు రుద్రాణి ఇలా చేశావ్ నా కొడుకు జీవితాన్ని బలి చేశావ్
రుద్రాణి: చెప్పాను కదా ఈ ఇంటి పరువు కోసం
అపర్ణ: లాగి పెట్టి చెంప పగలగొడుతుంది. ఇదే చెంప దెబ్బ అందరి ముందు కొడితే తలెత్తుకోలేవని ఓపిక పట్టాను
ఇంటి దగ్గర కనకం కోసం ఎదురు చూస్తూ ఉంటే బాధగా వస్తుంది. కానీ భర్త ఎదురుపడగానే మొహానికి నవ్వు పులుముకుని బాగుందని చెప్పమందని అంటుంది. మన కావ్యని వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని చెప్తుంది. అప్పు మాత్రం తన మాటలు నమ్మదు. అక్కడ జరిగిన దానికి మొత్తం రివర్స్ చేస్తుంది. డౌట్ లేదు అమ్మ బిస్కెట్స్ వేస్తుందని అప్పు అంటుంది. నోరు అబద్ధం చెప్పినా కళ్ళు నిజం చెప్తున్నాయని కృష్ణమూర్తి అంటాడు.
Also Read: అంతలోనే సంతోషం అంతలోనే బాధ- యష్ కి వేద తులాభారం, చెడగొట్టేందుకు వచ్చిన విన్నీ
అపర్ణ: నిన్ను ఎంత బాగా చూసుకున్నాం సొంత మనిషిలాగా చూసుకుంటే నువ్వు నీ బుద్ధి చూపించావ్. ఎవరు నువ్వు ఈ ఇంటి ఆడపడుచువా నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు నీ వంశం ఏ వంశం? ఎక్కడి నుంచి వచ్చావ్? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చి పెట్టామో మర్చిపోయావా? రాజ్ మీ తాతయ్య మంచితనం వల్ల ఈ పరాయి మనిషి ఈ ఇంటి ఆడపడుచులాగా ఉంటుంది అంతే తప్ప మన రక్తం కాదు. ఈమె తండ్రి తాతయ్య దగ్గర మేనేజర్ గా పని చేసేవాళ్ళు. ఆయన చనిపోతే తనని తీసుకొచ్చి కన్నాకూతురిలాగా చూసుకునే వాళ్ళు. ఇప్పటి దాకా ఈ విషయం పిల్లలకి తెలియకుండా ఉంచామంటే ఎంత గౌరవంగా చూసుకున్నాం. నీ పిల్లల్ని కూడా మా పిల్లలాగా చూసుకుంటే నా కొడుకు జీవితం ఇంత నవ్వుల పాలు చేస్తావా?
రుద్రాణి: చాలు.. నేను ఈ ఇంటి ఆడపడుచుగా పెరిగాను, అందుకే ఈ కుటుంబం పరువు కాపాడటం కోసం ఆ పిల్లని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టాను. నా తండ్రి ఈ కుటుంబం కోసం చేసిన త్యాగం వదిలేసి ఇంత అవమానిస్తారా?
ఇంద్రాదేవి: ఉద్యోగం కింద తన బాధ్యత చేశాడు త్యాగం అనకు.. అయినా కొత్త కోడలు బయట పెట్టేదాక నువ్వు చెప్పలేదంటే ఇది నువ్వు కావాలనే చేశావు
ధాన్యలక్ష్మి: జరిగింది ఏదో జరిగిపోయింది సాయంత్రం రిసెప్షన్ అని వెడ్డింగ్ కార్డ్ లో వేశాం గెస్ట్ లు వస్తారు కదా
అపర్ణ: ఈ దొంగ పెళ్లికి మళ్ళీ రిసెప్షన్ కూడానా
ఇంద్రాదేవి: కళ్యాణం జరిగింది రిసెప్షన్ కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోండి
Also Read: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ
నన్నే ఇంత అవమానిస్తావా ఇది జన్మలో మర్చిపోను, ఈ రుద్రాణి పగబడితే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తానని అనుకుంటుంది. కావ్య బాధగా కూర్చుంటే ఇంద్రాదేవి తన దగ్గరకి వస్తుంది. కళ్ళలో ఉండే నీళ్ళని మనసులో బాధని తుడిచేసేయ్ అని చెప్తుంది. ఇంటి కోడలిగా పరిచయం చేస్తారా అని కావ్య అంటుంది. ఈ ఆడంబరాలు అంటే నాకు నచ్చవని చెప్తుంది. ఈ ఇంటి పెద్ద కోడలిగా పరువు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అని అంటుంది. మీ డబ్బున్న వాళ్ళు మనసు చూడరా అని కావ్య అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఈ నగలు ఎలా వేయాలో నాకు తెలుసు అని నగలు తీసి తనకి ఇచ్చి వేసుకోమని అంటాడు.
సాయంత్రం రిసెప్షన్ నా ఖర్మ కొద్ది నిన్ను పరిచయం చేయాలని అనుకుంటున్నారని రాజ్ అంటాడు. నా ఖర్మ కొద్ది నేను రావాలనుకోవడం లేదని చెప్తుంది. నా కోసం మా కోసం వీటిని తీసుకుని జనాల కోసం వేసుకోమని అంటాడు. రాకపోతే బలవంతంగా నగలు వేస్తానని అంటే కావ్య రానని అనేసరికి రాజ్ కోపంగా నగ పైకి వేసిరేస్తాడు అది కాస్త కావ్య మెడలో పడుతుంది. స్వప్న రాహుల్ కోసం ఆఫీసుకి కాల్ చేస్తుంది. రాహుల్ సర్ మూడు రోజుల నుంచి ఆఫీసుకి రావడం లేదని అవతలి అమ్మాయి చెప్తుంది. అది విని స్వప్న షాక్ అవుతుంది. రాహుల్ మేనేజర్ అని ఈవినింగ్ ఇంట్లో రిసెప్షన్ అని ఆ అమ్మాయి చెప్పేసరికి అసలు ఏం జరుగుతుందని స్వప్న డౌట్ పడుతుంది.