దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్‌, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నిన్న, మొన్న (మార్చి 18, 19) పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.


తెలంగాణలో వాతావరణ స్థితి
ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, గయాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో  వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. అలాగే, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు గంటకు (30-40 కి.మీ.) వేగంతో వడగళ్లతో కూడిన వర్షాలు సాయంత్రం లేదా రాత్రికి కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.0 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 50 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతోంది. భారీ వర్షాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడగా, కొన్ని చోట్ల చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. పండిన పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండగా ఈ అకాల వర్షం రైతులకు నిద్రలేని రాత్రులను ఇచ్చింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వర్షం మరికొన్ని రోజులు కొనసాగనుంది. వాయువ్య, తూర్పు భారతదేశంలో వర్షాలు, వడగళ్ళు మార్చి 20 న కూడా కొనసాగుతాయి. ఇది కాకుండా, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉంది. మార్చి 19 నుంచి 21 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.