IPL 2023, Chennai Super Kings: ఐపీఎల్ 2023కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పెద్ద మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సిసంద మగలను జట్టులోకి తీసుకున్నారు. కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమిసన్ 2022 జూన్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్‌తో ఆడిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో కైల్ జేమీసన్ వెన్ను గాయానికి గురయ్యాడు.
రూ. కోటికి కైల్ జేమీసన్‌ను కొనుగోలు చేశారు
గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరం అయిన కైల్ జేమీసన్‌ను 2022లో జరిగిన మినీ వేలంలో రూ. కోటి చెల్లించి చెన్నై కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ దగ్గరగా ఉండటంతో, అతని స్థానంలో వేరే బౌలర్‌ను తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సిసంద మగల ఐపీఎల్ 2023 కోసం చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కానున్నాడు.
కైల్ జేమీసన్‌కు ఆపరేషన్
వెన్ను గాయంతో ఇబ్బంది పడిన కైల్ జేమీసన్ ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. దీని కారణంగా అతను దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు. కైల్ జేమీసన్‌ను 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 15 కోట్ల భారీ ధరకు జట్టులో చేర్చుకుంది. ఆ సీజన్‌లో అతను తొమ్మిది మ్యాచ్‌లలో బౌలింగ్ చేసి 9 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో కేవలం 16.25 సగటుతో పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అతని ఎకానమీ 9.60గా ఉంది. దీని తర్వాత అతను ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొనలేదు. సిసంద మగల గురించి చెప్పాలంటే అతను అనుభవజ్ఞుడైన టీ20 ఆటగాడు.
సిసంద మగల కెరీర్ ఎలా సాగింది?
సిసంద మగల దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటివరకు మొత్తం ఐదు వన్డేలు, నాలుగు టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. సిసంద మగల వన్డేల్లో ఆరు వికెట్లు, అంతర్జాతీయ టీ20ల్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇది కాకుండా అతను ఇప్పటివరకు మొత్తం 127 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 23.95 సగటుతో 136 వికెట్లు తీసుకున్నాడు.
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
31 మార్చి 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v గుజరాత్ టైటాన్స్ - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
2 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్ - చెపాక్ స్టేడియం, చెన్నై
8 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
12 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
17 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
21 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v సన్‌రైజర్స్ హైదరాబాద్, చెపాక్ స్టేడియం, చెన్నై
23 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
27 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, జైపూర్
30 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ v పంజాబ్ కింగ్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
4 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
6 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
10 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
1 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్కతా నైట్ రైడర్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
20 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ