మేష రాశి
మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. రోజు ప్రారంభంలో మీకు శుభవార్త అందుతుంది. కుటుంబ వాతావరణంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అవసరమైన పనులు పూర్తిచేసేందుకు పరుగులుతీస్తారు. సమాజంలో ప్రత్యేక స్థానం పొందుతారు
వృషభ రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది...మీ మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి సంబంధించి కూడా ఈ రోజు చాలా మంచి రోజు . మనసులో మాటను వ్యక్తం చేయడమే మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు విశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు మీ పనిని వాయిదా వేయకూడదు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు నమ్మకద్రోహానికి గురవుతారు...జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులు పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి
సింహ రాశి
ఈ రోజు మీకు బలహీనమైన రోజు. ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించడం మిమ్మల్ని చాలా కుంగదీస్తుంది. ఆహారం, దినచర్యపై శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
కన్యా రాశి
ఈరోజు మీకు ఆర్థిక లాభాల కోసం మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబంలోని సభ్యులందరితో పరస్పర సమన్వయం ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మీరు ఏ పని చేయాలని ప్రయత్నించినా ఆ పనిలో మంచి విజయం సాధిస్తారు.
Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!
తులా రాశి
ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీ విజయానికి, పురోగతికి దోహదం చేస్తాయి. మీరు శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ ఫలితాలు వస్తాయి. కుటుంబంలోని చిన్నవారి ఆరోగ్యం చెడిపోతుంది, దాని గురించి మీరు ఆందోళన చెందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆఫీసు పనులు రోజువారీ కంటే మెరుగ్గా పూర్తవుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకోని అతిథుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.
మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు నష్టపోకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగులు పనిపై నిర్లక్ష్యం వహించవద్దు. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు జాగ్రత్త.
కుంభ రాశి
ఈ రోజు కుంభరాశివారికి సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఖర్చులు పెరుగుతాయి..నియంత్రించేందుకు ప్రయత్నించండి. అనారోగ్యానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వివాహితుల జీవితంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది.
మీన రాశి
ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ స్నేహితులతో వ్యక్తిగత సమస్యలను పంచుకోవడం మానుకోవడం మంచిది. కొంతమంది తప్పుడు ప్రకటనలు మీ కష్టాలను పెంచుతాయి. బయటకు వెళ్లేటప్పుడు డబ్బుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు.