రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడన్న సామెతలు ఊరికే పుట్టలేదు. అనసూయను చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. సాధారణ ఒక న్యూస్ రీడర్‌గా ఆమె తన కెరీర్‌ను మొదలుపెట్టింది. న్యూస్ ఛానెల్‌ను వదిలి ఎంటర్టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. జబర్దస్త్ యాంకర్ గా అందరి మనసు గెలుచుకుంది. అక్కడ్నించి సినిమాల వైపు మెల్లగా అడుగులేసింది. ఇద్దరి పిల్లల తల్లి అయినా ఆ ఛాయలేవీ తనలో కనిపించకుండా ఫిట్ గా ఉండడం, డ్యాన్సు చేయగలగడం, అందంగా ఉండడం ఆమె  ప్లస్ పాయింట్లు. దీంతో అవకాశాలు బాగానే వచ్చాయి. ఎంతగా అంటే ఆమె కోసం ఓ క్యారెక్టర్ సృష్టించేంతగా. ఇప్పుడు టాలీవుడ్ బిజీగా ఉన్న నటుల్లో ఆమె కూడా ఒకరు. 


రోజుకి ఎంతంటే...?
రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించింది అనసూయ. ఆ పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చింది. అప్పట్నించి అనసూయ కోసం పాత్రలు పుట్టుకురావడం మొదలయ్యాయి. పుష్ప సినిమాలో ద్రాక్షాయణి పాత్ర కూడా అలాంటిదే. మంగళం శ్రీను భార్యగా విలనిజాన్ని బాగా పండించింది.  ఆ పాత్ర నిడివి తక్కువే అయినా ఆమె క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్. ఇక లుక్ కూడా కొత్తగా ఉంది. అయితే పుష్ప సినిమాలో నటించేందుకు ఆమె రోజుకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు డిమాండ్ చేసిందట. ఇక కాల్షీట్ల విషయానికి వస్తే పది రోజులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి ద్రాక్షాయణి పాత్ర కోసం అనసూయ 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్టు సమాచారం. అతి తక్కువ కాలంలోనే రోజుకు లక్షకు పైగా తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది సీనియర్లకే ఇంకా ఆ రేటు అందడం లేదు. అంతెందుకు మొన్నటి వరకు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా రోజుకు లక్ష రూపాయలు మాత్రమే తీసుకునేవారని టాక్. దీన్ని బట్టి చూస్తే అనసూయ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయినట్టు. 


పుష్ప పార్ట్ 2లో...
మొదటి భాగంలో ద్రాక్షాయణిగా ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నా... రెండో భాగంలో మాత్రం కీలకంగా ఉండొచ్చని టాక్. రెండో పార్ట్ లో మెయిన్ విలన్లలో ఆమె ఒకరిగా ఉండొచ్చని కూడా అంటున్నారు. 


Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: అమెరికాలో రికార్డులను తిరగరాస్తున్న ఆర్ఆర్ఆర్... జోరుగా ప్రీబుకింగ్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి