తన సినిమాలతో ఎందరినో  స్టార్లుగా మలిచిన గొప్ప దర్శకుడు శంకర్.  హీరోయిన్స్ ని కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా వాళ్లకో స్పెషల్ రోల్ డిజైన్ చేస్తాడు శంకర్. అలాంటి స్టార్ డైరెక్టర్ కుమార్తె ఇప్పుడు హీరోయిన్ గా పరిచయమవుతోంది. అదికూడా సూర్య సినిమాతో. కోలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్



రామ్ చరణ్ 15 వసినిమాతో టాలీవుడ్ లో తొలి స్ట్రైట్ మూవీ తీస్తోన్నాడు క్రియేటివ్ దర్శకుడు శంకర్.  ఈ మూవీలో చెర్రీ సరసన మరోసారి కియరా అద్వాని నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. ఈ మూవీని పాన్ ఇండియా కేటగిరీలో భారీగా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు శంకర్. మరో రెండు రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కూడా ఘనంగా ప్రారంభం కానుంది. చెర్రీ-కియరాపై ఓ పాట చిత్రీకరించనున్నారని టాక్. ఓవైపు టాలీవుడ్ లో క్రేజీ సినిమాతో బిజీగా ఉన్న శంకర్ మరోవైపు కోలీవుడ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పాడు.



హీరో సూర్య తదుపరి సినిమాలో శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తి హీరో. ``అదితి శంకర్ కి సాదర స్వాగతం. మీరు అందరి హృదయాలను గెలుచుకోబోతున్నారు! దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి !!`` అంటూ సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 






శంకర్ స్పందిస్తూ.. ``ప్రియమైన సూర్య అండ్ జ్యోతిక 2D ఎంటర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ ని ప్రారంభించి ఎల్లప్పుడూ నాణ్యమైన సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు!`` కార్తీ .. దర్శకుడు ముత్తయ్య -రాజశేఖర్ పాండియన్ కి ధన్యవాదాలు. సినీ ప్రేమికులు నా కుమార్తె అరంగేట్రానికి పూర్తిగా సిద్ధమవుతున్నందున తమ ప్రేమతో ముంచెత్తుతారని నేను నమ్ముతున్నాను`` అని అన్నారు.





``ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సూర్య సర్ #జ్యోతిక మేడమ్ గారికి చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. వందశాతం కృషి చేస్తాను`` అని అదితి తెలిపింది. `విరుమన్` అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా  సంగీత దర్శకుడు.


Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్లు మొదలు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?


ALso Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో


Also read: బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!