సోషల్ మీడియాలో దీప్తీ సునయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా వివరించి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 2లో ఆమె పార్టిసిపేట్ చేశారు. కొన్ని మ్యూజిక్ వీడియోస్‌లో నటించారు. త్వరలో ఆమె సినిమాలో కూడా చేయబోతున్నారా? కథానాయికగా ఆమెకు అవకాశం వచ్చిందా? అంటే... 'అవును' సోషల్ మీడియాలో కొంత మంది అంటున్నారు. దీప్తీ సునయనకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని, సినిమా చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వార్తలను దీప్తి సునయన ఖండించారు. 'ఫేక్ న్యూస్' అని కొట్టిపడేశారు.
'హీరోయిన్‌గా దీప్తీ సునయన... త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ' అని రాసి ఉన్న ఫొటో కార్డ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన దీప్తీ సునయన... "ఫేక్! నాకు తేలియదే ఇది" అని కామెంట్ చేశారు. సో... దీన్ని బట్టి హీరోయిన్‌గా ఆమె ఏ సినిమాకూ ఓకే చెప్పలేదని తెలుస్తోంది.
Also Read: రంగ రంగ వైభవంగా... మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి