Project K: ప్రభాస్ సినిమా కోసమే... హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకోన్!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హైదరాబాద్ వచ్చారు. అదీ ప్రభాస్ కోసమే! యంగ్ రెబల్ స్టార్‌తో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Continues below advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్ట్ కె' (ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను హైద‌రాబాద్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) కనిపించనున్న సంగతి తెలిసిందే. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం ఈ రోజు (డిసెంబర్ 4, శనివారం) ఆమె హైదరాబాద్ వచ్చారు. తాజా షెడ్యూల్‌లో ప్రభాస్, దీపికా పదుకోన్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభమైన రోజున ప్రభాస్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ ఇచ్చారు. అప్పుడు ఓ వారం రోజులు షూటింగ్ చేశారు. అందులో ప్రభాస్, అమితాబ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు ప్రభాస్ బ్రేక్ ఇచ్చారు. 'రాధే శ్యామ్', 'ఆది పురుష్' షూటింగులు కంప్లీట్ కావడంతో మళ్లీ ఈ సినిమాను పట్టాలు ఎక్కించారు. 'ప్రాజెక్ట్ కె' కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఓ విధంగా ప్రస్తుతం ప్రారంభించబోయే షెడ్యూల్ తొలి షెడ్యూల్ అని చెప్పాలి.

Continues below advertisement

Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
Also Read: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola