నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తమ అభిమాన హీరోని తెరపై ఎలా చూడాలనుకుంటారో.. దానికి ఏ మాత్రం తగ్గకుండా బాలయ్య క్యారెక్టర్ ను డిజైన్ చేశారు దర్శకుడు. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది ఈ సినిమా. 


అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యను పొగుడుతూ ట్వీట్లు వేస్తున్నారు. మహేష్ బాబు, నాని, రామ్ లాంటి హీరోలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్ పెట్టారు. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య 'అఖండ' సినిమా గురించి గొప్పగా మాట్లాడారు.


'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' అంటూ తన బాబాయ్ ని పొగిడేశారు కళ్యాణ్ రామ్. 'అఖండ' సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని.. బాబాయ్ ని ఫుల్ ఫోర్స్ లో చూశానని.. ఈ సినిమాతో హిట్ అందుకున్న టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తమ బాబాయ్ తో కలిసి 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటించారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో 'బింబిసార' అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.