సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత నిన్న కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సమంత పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుని కోరారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ముందు అందరూ సమానమేనని.. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని అన్నారు.
వాదనలు ముగిసిన అనంతరం కోర్టు ఈ పిటిషన్ పై స్పందించింది. పరువు నష్టం దావా వేసే బదులు.. వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే కదా అని కోర్టు పేర్కొంది.
అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమెను టార్గెట్ చేసి వార్తలు రాశారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకి వివరించారు.
తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానెల్స్ పై పరువునష్టం దావా దాఖలు చేశారు సమంత. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారన్నారు.
Also Read: చాందిని... మందు, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం
Also Read: 'భీమ్లా నాయక్' కొత్త స్టిల్.. పవన్, రానా పోజు చూశారా..?
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి