Toxic Shoot Begins: కేజీఎఫ్2 విడుదలైన 847 రోజులకు... టాక్సిక్ షూట్ స్టార్ట్ చేసిన యశ్!

Yash New Movie: రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా కొత్త సినిమా షూటింగ్ మొదలు అయ్యింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్ 2' విడుదలైన 847 రోజులకు ఆయన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.

Continues below advertisement

Yash Toxic Movie News: ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? రాకింగ్ స్టార్ యశ్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడు? ఇకపై ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. 'కెజియఫ్', 'కేజీఎఫ్ 2'కు ముందు ఆయన కేవలం కన్నడ హీరో మాత్రమే. కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌లో ఫాలోయింగ్ ఉన్న స్టార్! ఆయన మీద అంచనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని సరైన కథ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. కథ కుదరడంతో 'టాక్సిక్'ను సెట్స్ మీదకు వెళ్లారు. 

Continues below advertisement

'కేజీఎఫ్ 2' విడుదలైన 847 రోజులకు...
27 నెలలు... 121 వారాలు... 847 రోజులు... 'కేజీఎఫ్ 2' విడుదలై! ఆ సినిమాతో  ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చారు యశ్. ఆ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా 'టాక్సిక్' (Toxic Movie). ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌... అనేది క్యాప్షన్. ఇవాళ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. 'ది జర్నీ బిగిన్స్' అని ఆయన ట్వీట్ చేశారు.

Also Readతమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?

Toxic Movie Producer Name: 'టాక్సిక్'తో యశ్ నిర్మాతగా మారారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకం మీద వెంకట్ కె. నారాయణతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖర్చుకు రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించనున్నారు. 

Toxic Movie Director: 'టాక్సిక్' చిత్రానికి గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె మలయాళీ. ఇంతకు ముందు తీసిన సినిమాలకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం లభించింది. అలాగే, అవార్డులూ వచ్చాయి. మరి, ఇప్పుడు యశ్ హీరోగా ఎటువంటి సినిమా తీయబోతున్నారో? వెయిట్ అండ్ సి.

Also Read'వెంకీ' వర్సెస్ 'విశ్వం'... ఆ ట్రైన్ సీక్వెన్స్, శ్రీను వైట్ల మీద అందరి చూపు, ఏం చేస్తారో మరి?


'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌' సినిమా ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందు నిర్మాత వెంక‌ట్ కె. నారాయ‌ణ, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి క‌ర్ణాట‌క‌లోని ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రాలైన శ్రీ స‌దా శివ రుద్ర సూర్య ఆల‌యం, ధ‌ర్మ‌స్థ‌ల‌లోని శ్రీ మంజునాథేశ్వ‌ర ఆల‌యం, సుబ్ర‌మ‌ణ్య‌లోని కుక్కే సుబ్ర‌మ‌ణ్య ఆలయాలను యశ్ దర్శించుకున్నారు. కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముందు ఆలయాలకు వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడం ఆయనకు ఉన్న అల‌వాటు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Also Read: జాతి రత్నాలు దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా - అఫీషియల్ గురూ, బ్యానర్ ఏదో తెలుసా?


యశ్ సరసన కథానాయికగా శృతి హాసన్?
'టాక్సిక్' సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. అయితే... తొలుత కియారా అడ్వాణీ పేరు వినిపించింది. ఇంకొంత మంది పేర్లు సైతం పరిశీలనలోకి వచ్చాయట. అయితే, ఆ తర్వాత శృతి హాసన్ పేరు వచ్చింది. ఆమెను ఖరారు చేసినట్టు కర్ణాటక ఖబర్. మరి, దర్శక నిర్మాతలు ఏం చెబుతారో చూడాలి.

Continues below advertisement