Annapoorani Is Back to OTT In Simply South: సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అన్నపూరణి'. అప్పట్లో ఈ మూవీ ఎంత కాంట్రవర్సల్‌ అయ్యిందో తెలిసిందే. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను సైతం తొలగించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ ఓటీటీ రీఎంట్రీకి రెడీ అయ్యింది. అయితే ఇది ఇండియాలో మాత్రం. భారత్‌లో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉండనుందట. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాగా నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయన్‌ ఓ బ్రహ్మణ కటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. 


నయనతార 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలైన మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కొద్ది రోజులకే నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియా వైడ్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో హీరో రాముడిపై చేసిన కామెంట్స్‌ వివాదస్పదంగా నిలిచాయి. దీంతో మన ఇతిహాసాలను కించపరిచేలా, మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు మత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఈ అంశం కోర్టు కేసు వరకు కూడా వెళ్లింది. దీంతో వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ 'అన్నపూరణి'ని తొలగించింది. అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సల్‌ చిత్రం సింప్లీ సౌత్‌ అనే ఓటీటీలో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. తాజాగా దీనిపై సదరు ఓటీటీ సంస్థ తమ అధికారిక ఎక్స్‌లో ప్రకటన కూడా ఇచ్చింది. 






"ది సెన్సేషనల్‌ అన్నపూరణి ఈజ్‌ బ్యాక్‌. భారత్‌లో మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగష్టు 9 సిప్లీ సౌత్‌లో అందుబాటులోకి రానుంది" అని స్పష్టం చేసింది. నయనతార 75వ సినిమాగా అన్నపూరణి తెరకెక్కింది. 'ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌' అనేది ట్యాగ్‌ లైన్‌. లేడీ ఒరియంటెడ్‌ మూవీగా రూపొందిన ఈ సినిమాలో హీరో జై, బాహుబలి ఫేం సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. బ్రహ్మణ వర్గంకు చెందిన యువతి.. చెఫ్‌గా ఎదాలనే తన కలను ఎలా సాకారం చేసుకుందనే కథాంశంతో ఈ సినిమాను నీలేశ్‌ తెరకెక్కించారు. ఇందులో ఓ సీన్‌లో బ్రహ్మణ యువతి నాన్‌ వెజ్‌ ఎలా ఉండతుందనే అంశం చర్చకు రాగా.. అయితే రాముడు వనవాసంలో ఉన్నప్పుడు జింకను వేటాడి తిన్నాడు అనే చెప్పే డైలాగ్‌ వాడారు. అదే ఈ సినిమాను తీవ్ర వివాదంలోని నెట్టింది.  దీంతో ఏకంగా సినిమానే బ్యాన్‌ చేసే పరిస్థితి తెచ్చిపెట్టింది. 



అయితే ఈ వివాదంపై మూవీ టీం వివరణ కూడా ఇచ్చింది. హీరోయిన్‌ నయనతార సైతం ఈ విషయంపై స్పందించింది. "అన్నపూరణి సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే మంచి ఉద్దేశంతోనే రూపొందించాం. సంకల్ప బలం ఉంటే ఒక అమ్మాయి ఏదైనా సాధించగలదని చూపించే ప్రయత్నం చేశాం. కానీ మా ఈ ప్రయత్నంలో తెలియకుండానే కొందరిని మనోభావాలను దెబ్బతీశాం. ఇందుకు మా క్షమాపణలు. కానీ సెన్సార్ బోర్టు సర్టిఫికేట్‌ ఇచ్చిన సినిమాను ఓటీటీ నుంచి తొలగిస్తారని అసలు ఊహించలేదు. మేము ఎవరి మనోభావాలను దెబ్బతియాలని అనుకోలేదు. మత విశ్వాసాలను దెబ్బతీఏ ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ తెలియక మీ మనోభావాలను గాయపరించి ఉంటే క్షమించండి" అంటూ సోషల్‌ మీడియాలో వివరణ ఇచ్చింది నయన్‌.


Also Read: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చిందోచ్... రవితేజ మాస్, హరీష్ శంకర్ డైలాగ్స్‌లో ఫైర్