Writer Thota Prasad About Prabhas Greatness In Difficult Time: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అంటేనే గొప్ప మనసుకు మారుపేరుగా ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు. షూటింగ్ సమయంలో సెట్‌లోని వారికి ఇంటి నుంచి భోజనం తెచ్చి కడుపు నింపడం సహా.. ఆపదలో ఉన్న వారికి సైతం తన వంతు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ అందరికీ రియల్ లైఫ్ 'డార్లింగ్'గానూ పేరొందారు. ప్రభాస్ గొప్పతనం గురించి.. 'బిల్లా' (Billa) మూవీ రచయిత తోట ప్రసాద్ (Thota Prasad) చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. బిల్లా కోసం పని చేసిన రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూవీ డిస్కషన్ కోసం వెళ్లినప్పుడు ఇచ్చిన ఆతిథ్యం గురించి వివరించారు. అంతే కాకుండా.. తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలో.. ప్రభాస్ పుట్టెడు దుఃఖంలో ఉన్నా కూడా తనకు సాయం చేసినట్లు చెప్పారు. తన తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయిన బాధలో ఉన్నా తనకు పర్సనల్‌గా డబ్బులు పంపించారని తెలిపారు.






Also Read: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'పై పోలీసులకు ఫిర్యాదు - మరి నిర్మాత దిల్ రాజు ఏం చేస్తారో..?


'2010 ఫిబ్రవరి మహా శివరాత్రికి ముందు రోజు నేను అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాను. అదే రోజు దురదృష్టవశాత్తు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు కన్నుమూశారు. నేను ఆస్పత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి.. తన తండ్రి చనిపోయిన పుట్టెడు దుఃఖంలోనూ నా కోసం పర్సనల్ అమౌంట్ పంపించారు. నా పట్ల అంత కేర్ తీసుకున్నారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం అంటే ఎదుటి వారి గురించి ఆలోచించరు. పైగా తండ్రిని కోల్పోవడం మామూలు విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లోనూ తన సినిమా రైటర్ ఇబ్బందుల్లో ఉంటే స్పందించి సాయం చేశారు. అంత మంచి వ్యక్తి ప్రభాస్ గారు. అలాంటి వ్యక్తితో చాలా కాలం తర్వాత పని చేసే అవకాశం నాకు కన్నప్ప సినిమా ద్వారా లభించింది. చాలా సంతోషంగా ఉంది.' అని తోట ప్రసాద్ ప్రభాస్‌ గొప్పతనాన్ని వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షేర్ చేస్తూ ప్రభాస్ గ్రేట్‌నెస్‌ను కొనియాడుతున్నారు.


మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్, హను రాఘవపూడి ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత కల్కి 2, సలార్ 2 చిత్రాలు పట్టాలెక్కించనున్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ సైతం పట్టాలెక్కాల్సి ఉంది.


Also Read: నేచురల్ స్టార్ నాని బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్ - అవెయిటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్‌పై లేటెస్ట్ అప్ డేట్, రోల్ ఏంటో తెలియాలంటే..