Guntur Junior Artists Complaint Against Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా, ఈ మూవీ టీంపై కొందరు జూనియర్ ఆర్టిస్టులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను మోసం చేశారంటూ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన కొందరు జూనియర్ ఆర్టిస్టులు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి 350 మంది వెళ్లామని.. కో డైరెక్టర్ స్వర్గంశివ తమకు రూ.1200 ఇస్తామని చెప్పి చాలా రోజులుగా డబ్బులు ఇవ్వట్లేదని ఆరోపించారు. ఈ మేరకు జూనియర్ ఆర్టిస్ట్ తరుణ్‌తో సహా కొందరు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని.. స్వర్గంశివపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు చొరవ తీసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రూ.వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసి జూనియర్ ఆర్టిస్టుల డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాత దిల్ రాజు, టీం ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read: ఆ సినిమా చూసి స్టార్ డైరెక్టర్ శంకర్ ఏడ్చేశారు - సోషల్ మీడియా వేదికగా 'డ్రాగన్' టీంపై ప్రశంసలు


ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్


భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ మూవీ ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ , రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా 'గేమ్ ఛేంజర్' నిలిచింది. ఈ మూవీలో ఓ ఐఏఎస్ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటు, సినిమా విడుదలైన కొద్ది రోజులకే పైరసీ బారిన పడడం కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది.


కథేంటంటే..?


రామ్ నందన్ (రామ్ చరణ్) కాలేజీలో తాను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అడ్వాణీ) కోసం తనలో కోపాన్ని తగ్గించుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. ఆమె సూచన మేరకు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అధికారి అవుతాడు. ఈ క్రమంలోనే మంత్రి (ఎస్ జే సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది. తండ్రి సీఎం పదవి కోసం మంత్రైన కొడుకు ఎలాంటి ఎత్తులు వేశాడు.?. అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారిని తన అధికారంతో ఏం చేశాడు.?. రామ్ నందన్ మంత్రికి ఎలాంటి సమాధానం ఇచ్చాడు.? రామ్ చరణ్ ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టాల్సి వచ్చింది..? వంటివి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


Also Read: 'ఆ రోల్ కాకుండా వేరేది అయితే నో చెప్పేవాడిని' - రామాయణలో 'రావణ్' పాత్రపై నటుడు కన్నడ స్టార్ యశ్