Yash Reveal Why He Choose The Role Ravans In Ramayan: రామాయణం ఆధారంగా స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranabir Kapoor), సాయిపల్లవి (Sai Pallavi) లీడ్ రోల్స్‌లో బాలీవుడ్‌లో 'రామాయణ' (Ramayana) అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రావణ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఇదొక అద్భుతమైన పాత్ర. రామాయణలో నటించడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. కేవలం ఆ పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఓకే చెప్పాను. రామాయణానికి సంబంధించి ఇది కాకుండా వేరే పాత్ర ఏదైనా చేస్తారా..? అంటే నేను తప్పకుండా నో అనే చెప్తాను. ఓ నటుడిగా రావణ పాత్ర సవాలుతో కూడుకున్నది. ఆ రోల్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. యాక్టింగ్‌కు ఎంతో స్కోప్ ఉంటుంది.' అని యశ్ చెప్పారు.

'డీనెగ్' సీఈవో నమిత్ మల్హోత్రాను గతంలో కలిశానని.. ఆయన తనతో 'రామాయణ' గురించి చెప్పినట్లు యశ్ తెలిపారు. 'ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా పలు కారణాలతో సాధ్యపడట్లేదని చెప్పారు. ఇండియన్ మూవీస్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆయన విజన్ నన్ను ఎంతో ఆకర్షించింది. దీంతో, ఈ ప్రాజెక్టుకు సహ నిర్మాతలుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా.' అని పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత ఈ ప్రాజెక్టుతో పాటు యశ్.. 'టాక్సిక్‌'తో ముందుకొస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ షూటింగ్ జరుపుకొంటున్నట్లు మేకర్స్ తెలిపారు.

Also Read: నిజంగానే ఫ్యాన్స్ మనసులు 'కొల్లగొట్టినాదిరో...' - పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫుల్ సాంగ్ వచ్చేసింది!

వచ్చే ఏడాది విడుదల..!

'రామాయణ' (Ramayana) సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ మూవీతో ఆమె బాలీవుడ్‌లోకిి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైలెంట్‌గా ప్రారంభించగా.. అప్పట్లో సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే లీడ్ రోల్స్‌పై కొన్ని భాగాలను చిత్రీకరించారు. రావణుడి పాత్ర కోసం యశ్ సైతం రెండు రోజుల క్రితమే సెట్‌లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌లో భాగంగా భారీ యుద్ధ సన్నివేశాలను షూటింగ్ చేశారని సమాచారం. కొన్ని కీలక యుద్ధ సీన్లు ముంబైలోని అక్సా బీచ్‌లో షూట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో  భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుందని సమాచారం. దర్శకుడు నితేశ్ తివారీ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్‌ను 2026 దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్ 2027, దీపావళికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో లారా దత్తా, సన్నీ డియోల్, ఇందిరా కృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Also Read: హీరో విశాల్ నటి కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? - ఆ డైరెక్టర్ ఆమెను అడిగారా!, అసలు ఏం జరిగిందంటే?