Mrunal Thakur: రామ్ చరణ్ రొమాంటిక్ సాంగ్ మీద మనసు పారేసుకున్న మృణాల్... వైరల్ వీడియో చూశారా?
Mrunal Thakur : రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీలోని 'నానా హైరానా' అనే పాట తన ఫేవరెట్ అంటూ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

'సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ... తాజాగా తన ఫేవరెట్ సాంగ్ ఏంటో వెల్లడించింది. ఆ సాంగ్ రామ్ చరణ్ కొత్త మూవీలోది కావడం విశేషం. సదరు పాటకి హమ్మింగ్ చేస్తూ "ఇదే నా కొత్త ఫేవరెట్ సాంగ్" అంటూ ఆమె కామెంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మృణాల్ ఠాకూర్ ఫేవరెట్ సాంగ్ ఇదేనట
హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలు, ఇష్టాఇష్టాలను గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతగానో ఉవ్విళ్లూరతారు. కానీ కొంతమంది స్టార్స్ మాత్రమే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడతారు. అందులోనూ ఏదో ఒక ఇంటర్వ్యూలో మాత్రమే ఈ విషయాలు బయట పడతాయి. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. తన ఇష్టాయిష్టాలను, అభిరుచులను సైతం సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమనులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీలోని రొమాంటిక్ సాంగ్ 'నానా హైరానా' తన ఫేవరెట్ సాంగ్ అంటూ మృణాల్ ఠాకూర్ వెల్లడించింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్న క్రమంలో ఆమె షేర్ చేసిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ 'నానా హైరానా' సంగీత ప్రియుల మనసును దోచుకున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రొమాంటిక్ ట్రాక్ తన ఫేవరెట్ సాంగ్ అంటూ, దానిని వింటూ ఆస్వాదిస్తున్న వీడియోను మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది.
'గేమ్ ఛేంజర్'కు భారీ నష్టాలు
ఇదిలా ఉండగా 'గేమ్ ఛేంజర్' మూవీ భారీ హైప్ తో జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ స్టార్ తారాగణం ఉన్నప్పటికీ ఈ మూవీ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కాలేదు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 178 కోట్లు మాత్రమే వసూలు చేసి, నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త సినిమాతో అభిమానులను థియేటర్లలో పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఆర్సి 16' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. మరోవైపు 'రంగస్థలం' డైరెక్టర్ సుకుమార్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నాడు చెర్రీ.