తెలుగులో ఇప్పటిదాకా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ సినిమాలు 'హిట్' బ్లాక్ బస్టర్ టాక్ తెచుకున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్, హిట్ 2 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో మరో సీక్వెల్ పై మేకర్స్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను 'హిట్ 3 : ది థర్డ్ కేస్' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నాని హీరోగా నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. 


నాని బర్త్ డే ట్రీట్ 'హిట్ 3' టీజర్ రిలీజ్ 
ఇటీవల కాలంలో నాని కంటెంట్ బేస్డ్ సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్ 3'లో భాగం కాబోతున్నాడనే వార్త అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు అనే వార్త ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటి వరకు డీసెంట్ ఫ్యామిలీ మెన్ గా కనిపించిన నాని ఈ సినిమాలో రెబల్ లుక్ లో కనిపించబోతుండడం విశేషం. కొన్ని రోజుల క్రితం నాని ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు పూర్తి కావడంతో హిట్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫిబ్రవరి 24న టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్లో నాని గొడ్డలి పట్టుకుని కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. అలాగే ఒక మేకింగ్ వీడియోను కూడా వదిలారు.


Also Readఇండియాలో ఫస్ట్‌ 1000 కోట్ల సినిమాలో హీరోయిన్‌... 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు... ఆ హీరోలతో డేటింగ్ రూమర్లు!






ఇక చెప్పినట్టుగానే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేసి నాని ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ అయిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక నాని లుక్, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, అదిరిపోయే బీజీఎం ఇందులో మెయిన్ హైలెట్ గా నిలిచాయి. టీజర్ మంచి హైప్ క్రియేట్ చేయడంతో ఇప్పటి నుంచే మూవీ రిలీజ్ గురించి నాని ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. 


సమ్మర్ కానుకగా మూవీ విడుదల 
'హిట్ 3' సినిమాలో నాని సరసన 'కేజిఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా మే 1న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ విశాఖపట్నంలో పూర్తి చేశారు మూవీ టీం. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ఎడిటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 'సరిపోదా శనివారం' మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఇప్పుడు అదే జోష్ తో 'హిట్ 3' మూవీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేలా కనిపిస్తున్నాడు. కాగా గత ఏడాది డైరెక్టర్ శైలేష్ 'సైంధవ్' మూవీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన 'హిట్ 3' మూవీతో ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.


Also Readచిరంజీవి, కమల్ హాసన్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి