ఒకప్పుడు 100 కోట్ల సినిమాలు అంటేనే అతి పెద్ద రికార్డు అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలు ఏకంగా 1000 కోట్లు దాటి కలెక్షన్లను రాబట్టి సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు 500 నుంచి 700 కోట్ల మధ్య రిలీజ్ చేస్తేనే కమర్షియల్ గా సక్సెస్ అయినట్టుగా లెక్కలేస్తున్నారు. ఇక కలెక్షన్లు వెయ్యి కోట్లు దాటాయంటే ఆ సినిమాలకు తిరుగు లేదన్నట్టే. ఇప్పటిదాకా ఇండియాలో 1000 కోట్ల మార్క్ దాటిన సినిమాలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అయితే ఇండియన్ సినిమాలో 1000 కోట్ల సినిమాలో నటించిన మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా మరి? ఆ హీరోయిన్ మరెవరో కాదు... జేజమ్మ అనుష్క.


అనుష్క వయసు 40 ప్లస్... ఇంకా పెళ్లి కాలేదు


వెయ్యి కోట్లు సాధించిన మొదటి రెండు సినిమాల్లో 'బాహుబలి ది కంక్లూజన్' ఉంది. అనుష్క లేని బాహుబలిని ఊహించుకోలేం. దేవసేనగా ఆవిడ అద్భతంగా నటించారు. అనుష్క 2005లో 'సూపర్' అనే తెలుగు మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అరుంధతి, విక్రమార్కుడు, సింగం వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఇక 'బాహుబలి' మూవీతో ఈ బ్యూటీ ఫస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా రికార్డును క్రియేట్ చేసింది. సినిమాలు మాత్రమే కాదు అనుష్క పర్సనల్ లైఫ్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఈ అమ్మడు ప్రభాస్, సుమంత్, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో రిలేషన్షిప్ లో ఉందంటూ ఇప్పటిదాకా ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లను పట్టించుకోని అనుష్క పెళ్లి నిర్ణయాన్ని తల్లిదండ్రులకే అప్పగించానని, ఇప్పటికే పలుసార్లు చెప్పుకొచ్చింది. ఇక అనుష్క 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.


Also Read: చిరంజీవి, కమల్ హాసన్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి






రమ్యకృష్ణ ఖాతాలో అరుదైన రికార్డు 


'బాహుబలి' సినిమాతో మూడు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న రమ్యకృష్ణ అరుదైన మైలురాయిని సాధించింది రమ్యకృష్ణ. 'బాహుబలి' రెండు పార్ట్స్ లోనూ రమ్యకృష్ణ శివగామిగా "నా మాటే శాసనం" అంటూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఆమె రోల్ సినిమాలో కీలకమైన పాత్రలో ఒకటి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ యాక్టింగ్ కు ఇండియన్ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 'బాహుబలి 2' రూ.1810 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో రూ. 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాను చేసిన మొదటి నటిగా రమ్యకృష్ణ రికార్డును క్రియేట్ చేసింది. 


రమ్యకృష్ణ తన నటనా ప్రయాణాన్ని మలయాళ సినిమాతో మొదలు పెట్టింది. కానీ ఆమె ఫస్ట్ మూవీ ఆలస్యంగా 1986లో రిలీజ్ అయింది. అంతకంటే ముందు ఆమె తమిళంలో నటించిన ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. 1985లో ఈ తమిళ చిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత 'భలే మిత్రులు' మూవీతో రమ్యకృష్ణ తెలుగులోకి అడుగు పెట్టింది. అలాగే బాలీవుడ్లో 'పరంపర' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసే స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రమ్యకృష్ణ.



Also Readఫస్ట్ సినిమా ఫ్లాప్... ఇప్పుడు నిమిషానికి కోటి రెమ్యూనరేషన్... క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్... ఈ అందాల భామ ఎవరో తెలుసా?