ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్తాన్ మీద ఇండియన్ టీం విజయం సాధించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ స్పెషల్ మూమెంట్ అయ్యిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందాల భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)కు ఈ మ్యాచ్ మరింత స్పెషల్. ఎందుకు అంటే... తన పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు ఆవిడ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందుకున్నారు.
ఫుల్ ప్యాక్డ్ స్టేడియంలో... ఊర్వశి బర్త్ డే!
తెలుగు ప్రేక్షకులకు ఊర్వశీ రౌతేలా ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'డాకు మహారాజ్'లో ఆవిడ చేసిన స్పెషల్ సాంగ్ 'దబిడి దిబిడి' విపరీతంగా వైరల్ అయింది. దాని మీద ట్రోల్స్ కూడా వచ్చాయనుకోండి. అది పక్కన పెడితే... ఆ సాంగ్ కంటే ముందు ఆవిడ తెలుగులో చాలా స్పెషల్ సాంగ్స్ చేశారు.
Urvashi Rautela Birthday: ఊర్వశీ రౌతేలా పుట్టిన రోజు ఎప్పుడో తెలుసా? ఫిబ్రవరి 25వ తేదీన. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. తన బర్త్ డేకి ముందు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే... దానికి హాజరు అయ్యారు ఊర్వశి. అక్కడి స్టేడియం సిబ్బంది ఒకరు ఆమెకు కేక్ తీసుకు వచ్చి ఇచ్చారు.
Also Read: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
ఫుల్ ప్యాక్డ్ స్టేడియంలో భారతీయులతో పాటు పాక్ జనాలు, ఇంకా క్రికెట్ ప్రేమికుల ముందు బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డు క్రియేట్ చేశారు.
Also Read: ముమైత్ ఖాన్ మళ్ళీ వచ్చిందోచ్... యాక్టింగ్ కోసం కాదు, మేకప్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి!
మ్యాచ్ చూసేందుకు వెళ్లిన మెగాస్టార్...
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు పుష్ప 2 ది రూల్ దర్శకుడు సుకుమార్ సైతం దుబాయ్ వెళ్లారు. సతీమణి తబిత, కుమార్తె సుకృతి, తనయుడితో పాటు సుకుమార్ మ్యాచ్ చూశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం అక్కడికి వెళ్లారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో పాటు టీం ఇండియా మ్యాచ్ నెగ్గడంతో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం సంతోషం వ్యక్తం చేశారు.